
వార్నర్ రికార్డు బద్దలు
కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఆరు పరుగులు చేయగానే.. ఐపీఎల్‌లో ఒక జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. కోల్‌కతాపై రోహిత్ 904 పరుగులు చేశాడు. ఈ జాబితాలో చెన్నై స్టార్ ఆటగాడు సురేష్ రైనా 955 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతూన్నాడు. కోల్‌కతాపైనే హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ 829 రన్స్ చేశాడు. ఇక్కడ వార్నర్‌ను రోహిత్ అధిగమించాడు. వార్నర్‌ను వెనక్కినెట్టి రెండో స్థానానికి దూసుకొచ్చాడు.

200 సిక్సర్లు
14వ ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ రెండు సిక్సులు బాదాడు. 14వ ఓవర్ నాలుగో బంతిని సిక్స్ బాదడంతో ఐపీఎల్‌లో 200 సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో హిట్‌మ్యాన్ చేరాడు. ఐపీఎల్‌లో అత్యధిక సిక్సులు బాదిన ఆటగాడిగా విండీస్ హిట్టర్ క్రిస్ గేల్ (326 సిక్సులు) రికార్డుల్లో ఉన్నాడు. రెండో స్థానంలో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు 'మిస్టర్ 360' ఏబీ డివిలియర్స్ (214) ఉన్నాడు. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (212) మూడో స్థానంలో ఉన్నాడు.200 సిక్సర్లతో రోహిత్ నాలుగో స్థానంలో ఉన్నాడు. 194 సిక్సులతో సురేష్ రైనా తర్వాత ఉన్నాడు.

అత్యధికసార్లు 50కి పైగా స్కోర్లు
కోల్‌కతాపై హాఫ్ సెంచరీ బాదడంతో ఐపీఎల్‌లో అత్యధికసార్లు 50కి పైగా స్కోర్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో శిఖర్ ధావన్, ఏబీ డివిలియర్స్‌ను రోహిత్ శర్మ వెనక్కి నెట్టాడు. ధావన్, ఏబీ తలో 37 సార్లు 50 ప్లస్ స్కోర్లు చేశారు. 48 సార్లు 50 ప్లస్ స్కోర్లు చేసిన డేవిడ్ వార్నర్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ (41), సురేష్ రైనా (39)లు రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. 38 సార్లు 50 ప్లస్ స్కోర్లు చేసి రోహిత్ నాలుగో స్థానంలో ఉన్నాడు. మరొక్కటి బాదితే.. రైనాను అందుకుంటాడు.

పదిసార్లు ఐదు కంటే ఎక్కువ సిక్సులు
ఐపీఎల్ మ్యాచ్‌లో ఎక్కువసార్లు ఐదు లేదా అంతకంటే కంటే ఎక్కువ సిక్సులు కొట్టిన భారత క్రికెటర్లలో రోహిత్ శర్మ తొలి స్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకూ రోహిత్ పదిసార్లు ఐదు కంటే ఎక్కువ సిక్సులు బాదాడు. ఎంఎస్ ధోనీ, సురేష్ రైనా చెరో ఎనమిది సార్లు ఐదు లేదా అంతకంటే కంటే ఎక్కువ సిక్సులు కొట్టారు. అయితే రోహిత్ ఇక్కడ మరో రికార్డు కొద్దిలో మిస్ అయ్యాడు. మరో 10 పరుగులు చేస్తే.. ఐపీఎల్ టోర్నీ చరిత్రలో 5 వేల పరుగుల మైలురాయిని అందుకున్న మూడో బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లోకి ఎక్కేవాడు.
KKR vs MI: రోహిత్, సూర్యకుమార్ మెరుపులు.. కోల్‌కతా ముందు భారీ లక్ష్యం!!


Click it and Unblock the Notifications
