For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KKR vs MI: హార్దిక్ పాండ్యా చెత్త రికార్డు.. ఐపీఎల్ 2020లో తొలి బ్యాట్స్‌మన్‌ అతడే!!

KKR vs MI: Mumbai Indians All Rounder Hardik Pandya Gets Hit Wicket
IPL 2020,KKR vs MI : Hardik Pandya Gets Hit Wicket, Funny Memes On Twitter || Oneindia Telugu

అబుదాబి: యూఏఈ వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో అబుదాబి వేదికగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ ఎవరూ ఊహించని రీతిలో హిట్‌ వికెట్‌గా పెవిలియన్ చేరాడు. స్టంప్‌కి బ్యాట్‌ని తాకించి ఔట్ అయ్యాడు. దీంతో ఐపీఎల్ 2020 సీజన్‌లో తొలి హిట్‌ వికెట్ నమోదైంది.

స్టంప్‌కి బ్యాట్‌ని తాకించి:

స్టంప్‌కి బ్యాట్‌ని తాకించి:

కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌరవ్ తివారి పెవిలియన్ చేరిన అనంతరం 16వ ఓవర్లో హార్దిక్ పాండ్యా క్రీజులోకి వచ్చాడు. వచ్చిరావంతోనే పరుగుల వేట ఆరంబించాడు. 13 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 18 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్‌ వేసేందుకు ఆండ్రీ రసెల్ బంతిని అందుకున్నాడు. పాండ్యా పదే పదే ఆఫ్‌ స్టంప్‌ లైన్‌పైకి వెళ్లి ఆడుతుండటంతో.. రసెల్ తెలివిగా వైడ్‌ లైన్‌కి సమీపంలో యార్కర్‌ని సంధించాడు. బంతి క్షణాల్లో వెళ్లి కీపర్ చేతుల్లో పడింది. అయితే ఆ బంతిని షాట్ ఆడేందుకు పాండ్యా.. ఆఫ్‌స్టంప్‌ సమీపానికి వెళ్లాడు. షాట్ ఆడబోయే క్రమంలో పాండ్యా.. స్టంప్‌కి బ్యాట్‌ని తాకించేశాడు. ఇంకేముంది హిట్‌ వికెట్‌గా పెవిలియన్ చేరాడు.

పెవిలియన్ చేరే క్రమంలో:

పెవిలియన్ చేరే క్రమంలో:

హార్దిక్ పాండ్యా హిట్‌ వికెట్ అయిన తర్వాత కొన్ని క్షణాలపాటు అసలు ఏం జరిగిందో.. వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్, షాట్ ఆడిన ముంబై బ్యాట్స్‌మన్‌కు తప్ప ఎవరికీ అర్థం కాలేదు. బౌలర్ ఆండ్రీ రసెల్ సైతం ఎలా ఔట్ అనే తరహాలో సందేహం వ్యక్తం చేశాడు. అంపైర్‌కు కూడా అక్కడ ఏం జరిగిందో కాసేపు అర్థం కాలేదు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని అందరూ ఓ అలా ఔట్ అయ్యాడా అని అనుకున్నారు. అయితే హిట్‌ వికెట్ అయిన తర్వాత పెవిలియన్ చేరే క్రమంలో హార్దిక్ నవ్వుతూ కనిపించాడు. ఈ సీజన్‌లో హిట్ వికెట్ ద్వారా ఔట్ అయిన తొలి ప్లేయర్‌గా హార్దిక్ నిలిచాడు. పాండ్యా బ్యాటింగ్ చేసిన తీరుపై అభిమానులు సెటైర్లు పేలుస్తున్నారు.

కమిన్స్‌ను కూడా:

కమిన్స్‌ను కూడా:

వేలంలో రూ.15.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన కో‌ల్‌కతా బౌలర్ ప్యాట్ కమిన్స్‌ను ముంబై బ్యాట్స్‌మెట్ ఆటాడుకున్నారు. మూడు ఓవర్లలో 49 పరుగులు సమర్పించుకున్నాడు. అతడి బౌలింగ్‌లో రోహిత్‌, సౌరవ్‌, హార్దిక్‌ ఫోర్లు, సిక్సర్లు‌ బాదారు. 5వ ఓవర్లో 15, 15వ ఓవర్లో 15, 17వ ఓవర్లో 19 పరుగులు ఇచ్చాడు. లయ అందుకోవడానికి ఇబ్బంది పడిన కమిన్స్ 4 వైడ్లు కూడా వేశాడు. ధారాళంగా పరుగులు ఇవ్వడంతో కోల్‌కతా కెప్టెన్ కమిన్స్‌తో పూర్తి కోటా బౌలింగ్ చేయించలేదు. అత్యధిక ధర పలికిన ఈ పేసర్.. ప్రభావం చూపకపోవడం పట్ల నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

ముంబై ఘన విజయం

ముంబై ఘన విజయం

ఐపీఎల్ 2020 భాగంగా బుధవారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఘన విజయం సాధించింది. దీంతో ఐపీఎల్ 13వ సీజన్‌లో ముంబై బోణీ చేసింది. ఈ మ్యాచ్‌లో రోహిత్‌సేన 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. భీకర హిట్టర్ల జట్టుగా పేరున్న కోల్‌కతా జట్టు ముంబై బౌలర్ల ముందు నిలవలేకపోయింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై.. రోహిత్‌ శర్మ (80, 54 బంతుల్లో; 3×4, 6×6) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. ప్యాట్ కమిన్స్‌ (33, 12 బంతుల్లో; 1×4, 4×6) సిక్సర్లతో మెరిశాడు.

KKR vs MI: కోల్‌కతా హిట్టర్లు హిట్ అవ్వలేదు.. ముంబై చేతిలో ఘోర పరాజయం!!

Story first published: Thursday, September 24, 2020, 8:21 [IST]
Other articles published on Sep 24, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+