Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KR vs MI: ఇషాన్ కిషన్, జస్‌ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత!

ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్స్ ఇషాన్ కిషన్, జస్‌ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డులు సాధించారు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో రేర్ ఫీట్ అందుకున్నారు.

ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక వికెట్లలో పాలుపంచుకున్న వికెట్ కీప‌ర్‌గా ఇషాన్ కిషన్ రికార్డ్ సాధించాడు. ఈ క్రమం‌లో క్వింటన్ డికాక్ రికార్డ్‌ను అతను అధిగమించాడు. డికాక్ 47 ఔట్లలో పాలు పంచుకోగా.. ఇషాన్ కిషన్ 48 డిస్‌మిస్సల్స్‌లో భాగమయ్యాడు.

Ishan Kishan becomes most

బుమ్రా బౌలింగ్‌లో రింకూ సింగ్‌‌ ఇచ్చిను క్యాచ్ అందుకోవడం ద్వారా ఇషాన్ కిషన్ ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక సీజన్లలో 20 అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా రెండో స్థానంలో ఉన్నాడు.

ఇప్పటి వరకు ఆయన నాలుగు సార్లు 20+ వికెట్లు తీసాడు. ఈ జాబితాలో యుజ్వేంద్ర చాహల్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతను 5 సార్లు 20+ వికెట్లు తీసాడు. లసిత్ మలింగా, బుమ్రా ఇప్పటికి తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక వికెట్లలో భాగమైన వికెట్ కీపర్:

ఇషాన్ కిషన్ 48
క్వింటన్ డికాక్ 47
పార్ధీవ్ పటేల్ 28
దినేశ్ కార్తీక్ 21

ఒక ఐపీఎల్ సీజన్‌లో 20 అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లు

యుజ్వేంద్ర చాహల్ 5
జస్‌ప్రీత్ బుమ్రా 4
లసిత్ మలింగా 4

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 16 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్(21 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42), నితీష్ రాణా(23 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 33) దూకుడుగా ఆడారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో పియూష్ చావ్లా, బుమ్రా రెండేసి వికెట్లు తీయగా.. నువాన్ తుషారా,అన్షుల్ కంబోజ్ తలో వికెట్ పడగొట్టారు.

Story first published: Saturday, May 11, 2024, 23:47 [IST]
Other articles published on May 11, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+