Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR vs MI మ్యాచ్‌కు భారీ అడ్డంకి.. ఇంకా మొదలవ్వని గేమ్!

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు భారీ అడ్డంకి ఏర్పడింది. వర్షం అంతరాయం కారణంగా ఈ మ్యాచ్ ఇంకా ప్రారంభం కాలేదు. షెడ్యూల్ ప్రకారం రాత్రి 7 గంటలకు టాస్ వేయాల్సి ఉండగా.. వర్షం కురుస్తుండటంతో అంపైర్లు ఇంకా మైదానంలోకి అడుగుపెట్టలేదు.

ప్రస్తుతం మైదానాన్ని పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. వర్షం బాగా కురుస్తండటంతో మ్యాచ్ జరిగే అవకాశాలు కల్పించడం లేదు. అయితే ఈడెన్ గార్డెన్స్‌లో వర్షం నీరును బయటకు పంపించేందుకు అధునాతన పరికరాలు అందుబాటులో ఉండటం కలిసొచ్చే అంశం. వర్షం కాస్త గ్యాప్ ఇచ్చినా.. మైదానాన్ని క్షణాల్లో సిద్దం చేసే టెక్నాలజీ ఈడెన్ గార్డెన్స్‌లో ఉంది.

KKR vs MI IPL 2024 Toss delayed due to rain at Eden Gardens

వర్షం కారణంగా ఇరు జట్ల ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితమయ్యారు. ఈ మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ లభించనుంది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇప్పటికే తప్పుకున్న ముంబై ఇండియన్స్‌కు ఎలాంటి ఇబ్బంది లేకున్నా.. టేబుల్ టాపర్‌గా ఉన్న కేకేఆర్‌కు సమస్యగా మారనుంది. ప్లే ఆఫ్స్ బెర్త్ దాదాపు ఖరారు అయినా.. అగ్రస్థానంలో నిలవాలంటే ఈ మ్యాచ్ గెలవడం ఆ జట్టుకు కీలకం.

వర్షం విషయంలో అంపైర్లు కటాఫ్ సమయం వరకు వేచి చూసి తుది నిర్ణయం తీసుకోనున్నారు. 5 ఓవర్లు సాధ్యమైనా మ్యాచ్ నిర్వహిస్తారు. ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారితే మాత్రం మ్యాచ్‌ రద్దు చేయాల్సిందే.

Story first published: Saturday, May 11, 2024, 19:39 [IST]
Other articles published on May 11, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+