Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR vs LSG: రింకూ సింగ్ పోరాటం వృథా.. ఒక్క పరుగుతో గెలిచిన లక్నో!

కోల్‌కతా: ఐపీఎల్ 2023 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ మరో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో శనివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. కేకేఆర్ విజయం కోసం రింకూ సింగ్(33 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 67 నాటౌట్) ఆఖరి బంతి వరకు చేసిన పోరాటం వృథా అయ్యింది.

యశ్ థాకూర్ అసాధారణ బౌలింగ్‌తో లక్నోకు విజయాన్నందించాడు. ఈ గెలుపుతో లక్నో సూపర్ జెయింట్స్ పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకుంది.

 KKR vs LSG:

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 176 పరుగులు చేసింది. నికోలస్ పూరన్(30 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 58) విధ్వంసకర హాఫ్ సెంచరీతో రాణించగా.. ఆయుష్ బదోని(21 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 25) అండగా నిలిచాడు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్ తలో రెండు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తీ, హర్షిత్ రాణా తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగులు చేసి ఓటమిపాలైంది. రింకూ సింగ్‌కు తోడుగా జాసన్ రాయ్(28 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 45) రాణించాడు. లక్నో బౌలర్లలో యశ్ థాకూర్, రవి బిష్ణోయ్ రెండేసి వికెట్లు తీయగా.. కృనాల్ పాండ్యా ఓ వికెట్ పడగొట్టాడు.

భారీ లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్‌కు ఓపెనర్లు జాసన్ రాయ్, వెంకటేశ్ అయ్యర్(24) శుభారంభాన్ని అందించారు. ఇద్దరూ ధాటిగా ఆడటంతో 5.4 ఓవర్లలోనే కేకేఆర్ 61 పరుగులు చేసింది. డేంజరస్‌గా మారిన ఈ జోడీని కృష్ణప్ప గౌతమ్ విడదీసాడు. వెంకటేశ్ అయ్యర్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో కేకేఆర్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది.

పవర్ ప్లే అనంతరం జాసన్ రాయ్ అదే జోరు కొనసాగించగా.. రవి బిష్ణోయ్ దెబ్బకొట్టాడు. నితీశ్ రాణా(8)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. హాఫ్ సెంచరీకి చేరువైన జాసన్ రాయ్‌ను కృనాల్ పాండ్యా క్లీన్ బౌల్డ్ చేయడంతో కేకేఆర్ వికెట్ల పతనం మొదలైంది. ఆ తర్వాత వచ్చిన రెహ్మానుల్లా గుర్బాజ్(10)ను యశ్ థాకూర్ ఔట్ చేయగా.. ఆ వెంటనే డేంజరస్ ఆండ్రీ రస్సెల్(7)ను బిష్ణోయ్ క్లీన్ బౌల్డ్ చేశాడు.

శార్దూల్ ఠాకూర్‌(3)ను యశ్ థాకూర్, సునీల్ నరైన్‌(1)ను నవీన్ ఉల్ హక్ రనౌట్ చేశాడు. ఓవైపు వికెట్లు పడ్డా మరోవైపు రింకూ సింగ్ ఒంటరి పోరాటం చేశాడు. కేకేఆర్ విజయానికి చివరి 12 బంతుల్లో41 పరుగులు అవసరమవ్వగా.. నవీన్ ఉల్ హక్ వేసిన 19వ ఓవర్‌లో రింకూ సింగ్ హ్యాట్రిక్ ఫోర్లతో పాటు ఓ సిక్స్ బాది 20 పరుగులు పిండుకున్నాడు. దాంతో చివరి ఓవర్‌లో కేకేఆర్ విజయానికి 21 పరుగులు అవసరమయ్యాయి.

చివరి ఓవర్‌ను యశ్ థాకూర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి లక్నో విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. అయితే ఈ ఓవర్‌లో తొలి రెండు బంతులను డాట్ చేసిన రింకూ సింగ్.. చివరి మూడు బంతులను 6, 4, 6 కొట్టినా లాభం లేకపోయింది.

Story first published: Saturday, May 20, 2023, 23:41 [IST]
Other articles published on May 20, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+