Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: చెలరేగిన డికాక్, దీపక్ హుడా.. కేకేఆర్ ముందు భారీ లక్ష్యం!

Quinton de kock fifty helps lucknow

పుణే: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)తో జరుగుతున్న మ్యాచ్‌లో క్వింటన్ డికాక్(29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. దాంతో కేకేఆర్ ముందు లక్నో 177 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. డికాక్‌కు తోడుగా దీపక్ హుడా(41), కృనాల్ పాండ్యా(25), మార్కస్ స్టోయినీస్ (28) రాణించడంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఐదో బంతికే రాహుల్ రనౌటయ్యాడు. డికాక్‌తో సమన్వయ లోపం కారణంగా డైమండ్ డక్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన దీపక్ హుడాతో కలిసి క్వింటన్ డికాక్ చెలరేగాడు. దాంతో పవర్ ప్లేలోనే లక్నో వికెట్ నష్టానికి 66 పరుగులు చేసింది. 28 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన డికాక్.. సునీల్ నరైన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

దాంతో రెండో వికెట్‌కు నమోదైన 72 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కృనాల్ పాండ్యాతో కలసి దీపక్ హుడా కూడా చెలరేగాడు. హాఫ్ సెంచరీకి చేరువైన అతన్ని రస్సెల్ పెవిలియన్ చేర్చాడు. ఆ కొద్దిసేపటికే కృనాల్ పాండ్యా కూడా ఔటయ్యాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన మార్కస్ స్టోయినిస్ ధాటిగా ఆడాడు. హోల్డర్ ఔటైనా.. ఆయుష్ బదోని(15 నాటౌట్) జట్టు స్కోర్‌ను 170 మార్క్‌ను ధాటించాడు.

Story first published: Saturday, May 7, 2022, 21:51 [IST]
Other articles published on May 7, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+