Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ ఊచకోత

ఐపీఎల్ 2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్ల విధ్వంసం కొనసాగుతోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో మిచెల్ మార్ష్(48 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 81), నికోలస్ పూరన్(36 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 87 నాటౌట్) పరుగుల సునామీ సృష్టించారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 238 పరుగులు చేసింది.

కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా(2/51) రెండు వికెట్లు తీయగా.. ఆండ్రీ రస్సెల్ ఓ వికెట్ పడగొట్టాడు. లక్నో ఇన్నింగ్స్‌లో మొత్తం 15 సిక్సర్లు నమోదవ్వగా.. మార్ష్, పూరన్‌లే 13 సిక్స్‌లు కొట్టారు.

KKR vs LSG IPL 2025 Mitchell Marsh and Nicholas Pooran Power Hitting Helps Lucknow Post 238 3

మిచెల్ మార్ష్ విధ్వంసం..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నోకు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఆచితూచి ఆడిన ఓపెనర్లు మార్క్‌రమ్, మిచెల్ మార్ష్.. తెలివిగా బ్యాటింగ్ చేశారు. టైట్ బౌలింగ్‌ను గౌరవించిన ఈ జోడీ.. లూజ్ బాల్స్‌ను బౌండరీలకు తరలించింది. పవర్ ప్లేలో స్పెన్సర్ జాన్సన్‌పై ఎదురు దాడికి దిగిన ఈ జోడీ.. వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తీ బౌలింగ్‌ను ఆచితూచి ఆడింది.

దాంతో పవర్ ప్లేలో లక్నో వికెట్ నష్టపోకుండా 56 పరుగులే చేసింది. ఆ తర్వాత కూడా వరుణ్‌ను గౌరవించిన ఈ ఇద్దరూ మిగతా బౌలర్ల‌పై విరుచుకుపడ్డారు. హాఫ్ సెంచరీ ముంగిట మార్క్‌రమ్(47)ను హర్షిత్ రాణా క్లీన్ బౌల్డ్ చేశాడు. అదే ఓవర్‌లో కవర్స్ దిశగా బౌండరీ బాదిన మిచెల్ మార్ష్.. 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

పూరన్ ఊచకోత..
అనంతరం మరింత ధాటిగా ఆడిన అతను స్పెన్సర్ జాన్సన్, వైభవ్ అరోరా బౌలింగ్‌లో భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. భారీ సిక్స్‌లు బాదాడు. అతనికి తోడుగా నికోలస్ పూరన్ కూడా చెలరేగడంతో లక్నో స్కోర్ బోర్డు పరుగెత్తింది. సెంచరీ దిశగా సాగిన మిచెల్ మార్ష్‌ను రస్సెల్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. మార్ష్ ఔటైనా.. పూరన్ తన దూకుడు కొనసాగించాడు.

హర్షిత్ రాణా బౌలింగ్‌లో లాంగాన్ దిశగా భారీ సిక్స్ బాది 21 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రస్సెల్ వేసిన 18వ ఓవర్‌లో 0,4,6,4, 6తో 24 పరుగులు పిండుకున్నాడు. చివరి రెండు ఓవర్లు కేకేఆర్ బౌలర్లు కట్టడిగా బౌలింగ్ చేయడంతో లక్నో 238 పరుగులకే పరిమితమైంది.

Story first published: Tuesday, April 8, 2025, 17:18 [IST]
Other articles published on Apr 8, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+