Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR vs LSG: అందుకే బౌలింగ్ ఎంచుకున్నా: అజింక్యా రహానే

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే తెలిపాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. పిచ్ చూడటానికి బాగుంది. ఉక్కపోతగా కూడా లేదు. వికెట్‌లో పెద్దగా మార్పు ఉండదు. ఒక సైడ్ బౌండరీ చాలా చిన్నగా ఉంది. అందుకే మేం ముందుగా బౌలింగ్ చేస్తున్నాం.

ప్రతీ ఒక్కరు ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఉన్నారు. ఈ మ్యాచ్‌తో ఫ్రెష్‌గా మొదలుపెట్టాలని భావిస్తున్నారు. సానుకూలంగా ఉండాల్సిన అవసరం ఉంది. మా ఓపెనర్లపై చాలా విమర్శలు వస్తున్నాయి. కానీ డికాక్, సునీల్ నరైన్‌లు మా మ్యాచ్ విన్నర్లు. వారి గురించి మాకు ఎలాంటి ఆందోళన లేదు. మోయిన్ అలీ స్థానంలో స్పెన్సర్ జాన్సన్ ఆడుతున్నాడు.'అని అజింక్యా రహానే తెలిపాడు.

KKR vs LSG IPL 2025 Ajinkya Rahane Says One side boundary is small that s why we are bowling first

మరోవైపు తాము సంతోషంగా ఉన్నామని ఏ మాత్రం చెప్పనని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ అన్నాడు. గతం గురించి ఎక్కువగా ఆలోచించడం లేదని, సానుకూలాంశాలను మాత్రమే తీసుకొని ముందుకు సాగుతున్నామని తెలిపాడు. జట్టుగా విజయాలు సాధిస్తున్నందుకు ఓ కెప్టెన్‌గా సంతోషంగా ఉందన్నాడు. తుది జట్టులో మార్పులు లేకుండా సేమ్ టీమ్‌తో ఆడుతున్నట్లు చెప్పాడు.

తుది జట్లు:

కోల్‌కతా నైట్ రైడర్స్: క్వింటన్ డి కాక్(కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే(కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, స్పెన్సర్ జాన్సన్, వరుణ్ చక్రవర్తి

లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, ఎయిడెన్ మార్క్‌రమ్, నికోలస్ పూరన్, రిషభ్ పంత్(కీపర్/కెప్టెన్), ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, ఆకాశ్ దీప్, అవేష్ ఖాన్, దిగ్వేష్ సింగ్ రాఠీ.

Story first published: Tuesday, April 8, 2025, 15:31 [IST]
Other articles published on Apr 8, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+