కోల్‌కతా: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్లు మరోసారి విఫలమయ్యారు. ఓపెనర్ రెహ్మానుల్లా గుర్బాజ్(39 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 81) హాఫ్ సెంచరీతో రాణించినా.. మిగతా బ్యాటర్లు చేతులెత్తేయడంతో కేకేఆర్ సాధారణ స్కోర్‌కే పరిమితమైంది.
చివర్లో ఆండ్రీ రస్సెల్ (19 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 34) మెరుపులు మెరిపించడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 179 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మహమ్మద్ షమీ మూడు వికెట్లు తీయగా.. జోష్ లిటిల్, నూర్ అహ్మద్ రెండేసి వికెట్లు తీసారు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు మరోసారి శుభారంభం దక్కలేదు. ఓపెనర్ నారయణ్ జగదీషన్(19) దారుణంగా విఫలమయ్యాడు. శార్దూల్ ఠాకూర్‌ను అప్‌ది ఆర్డర్ పంపిస్తూ కేకేఆర్ మేనేజ్‌మెంట్ చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. షమీ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయిన శార్దూల్.. డకౌట్‌గా వెనుదిరిగాడు. దాంతో పవర్ ప్లేలో కేకేఆర్ 2 వికెట్లకు 61 పరుగులు చేసింది.
క్రీజులోకి వచ్చిన వెంకటేశ్ అయ్యర్(11), నితీశ్ రాణా(4)లను జోష్ లిటిల్ ఒకే ఓవర్‌లో పెవిలియన్ చేర్చగా.. రింకూ సింగ్(19)ను నూర్ అహ్మద్ ఔట్ చేశాడు. చివర్లో ఆండ్రీ రస్సెల్ మెరుపులు మెరిపించడంతో కేకేఆర్ 180 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచింది.