Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR vs DC: స్టోయినిస్ ఇన్.. కరన్ ఔట్! రస్సెల్‌కు నో చాన్స్! ఢిల్లీదే బ్యాటింగ్!

Unchanged Kolkata bowl, Delhi welcome back Marcus Stoinis

షార్జా: ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-2లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నానని మోర్గాన్ తెలిపాడు. ఏలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. ఇక తాము కూడా ఫీల్డింగ్ ఎంచుకుందామనుకున్నామని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ తెలిపాడు. స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ జట్టులోకి రాగా.. టామ్ కరన్ ఉద్వాసనకు గురైనట్లు చెప్పాడు. ఈ మ్యాచ్‌లో గెలిచిన ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో అమీతుమీ తేల్చుకోనుండగా.. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. దాంతో ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.

లీగ్‌ దశలో తొలి ముఖాముఖి మ్యాచ్‌లో దిల్లీ నెగ్గగా.. రెండో మ్యాచ్‌లో కోల్‌కతా గెలిచింది. యూఏఈలో రెండో అంచె ఆరంభమైనప్పటి నుంచి కోల్‌కతా రెండోసారి బ్యాటింగ్‌ చేసిన ప్రతిసారీ గెలిచింది. దిల్లీ ఈ సీజన్లో ఓడిన అయిదు మ్యాచ్‌లూ మొదట బ్యాటింగ్‌ చేసినప్పటివే. రెండో క్వాలిఫయర్‌ వేదికైన షార్జాలో ఈ సీజన్లో జరిగిన ఏడు మ్యాచ్‌ల్లో అయిదుసార్లు లక్ష్యాన్ని ఛేదించిన జట్టే నెగ్గింది.

తుది జట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్‌: రిషబ్ పంత్‌ (కెప్టెన్‌), శిఖర్ ధావన్‌, పృథ్వీ షా, శ్రేయస్‌ అయ్యర్‌, హెట్‌మైర్, స్టోయినిస్‌, అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌, నార్జ్‌, రబడా, అవేష్‌ ఖాన్‌.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌: మోర్గాన్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, రాహుల్‌ త్రిపాఠి, నితీశ్‌ రాణా దినేశ్‌ కార్తీక్‌, షకిబ్‌, నరైన్‌, ఫెర్గూసన్‌, మావి, వరుణ్‌ చక్రవర్తి.

Story first published: Wednesday, October 13, 2021, 19:13 [IST]
Other articles published on Oct 13, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+