KKR vs DC:వారెవ్వా వాటే మ్యాచ్.. సిక్స్ కొట్టి గెలిపించిన రాహుల్ త్రిపాఠి! పాపం ఢిల్లీ!

షార్జా: ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐపీఎల్ 2021 సీజన్ ఫైనల్ చేరింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో 3 వికెట్లతో థ్రిల్లింగ్ విజయాన్నందుకుంది. ఆఖరి 2 బంతులకు 6 పరుగుల కావాల్సిన పరిస్థితుల్లో రాహుల్ త్రిపాఠి(11 బంతుల్లో సిక్స్‌తో 12 నాటౌట్) సూపర్ సిక్స్‌తో చిరస్మరణీ విజయాన్నందించాడు. దసరా( అక్టోబర్ 15) రోజున జరిగే టైటిల్ ఫైట్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో కేకేఆర్ అమీతుమీ తేల్చుకోనుంది.
ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలలో 5 వికెట్లకు 135 రన్స్ చేసింది. శ్రేయస్ అయ్యర్(27 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 30 నాటౌట్), శిఖర్ ధావన్(39 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 36) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ రెండు వికెట్లు తీయగా.. ఫెర్గూసన్, శివం మావి తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన కేకేఆర్ 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 136 పరుగులు చేసి ఓ బంతి మిగిలుండగానే గెలుపొందింది.
వెంకటేశ్ అయ్యర్(41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 55) హాఫ్ సెంచరీతో రాణించగా..శుభ్‌మన్ గిల్ (46 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 4) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 96 పరుగుల భాగస్వామ్యాన్ని అందించడంతో ఓ దశలో కేకేఆర్ సునాయసంగా గెలుస్తుందనిపించింది. కానీ రబడా, నోర్జ్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. కానీ రాహుల్ త్రిపాఠి భారీ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించేసాడు.
ఓపెనర్ల శుభారంభం..
136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ శుభారంభం అందించారు. ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్‌నే గిల్.. బౌండరీ తరలించగా.. అశ్విన్ వేసిన రెండో ఓవర్‌లో వెంకటేశ్ అయ్యర్ బౌండరీ బాదాడు. ఇక అక్షర్ వేసిన నాలుగో ఓవర్‌లో భారీ సిక్సర్ బాదిన వెంకీ.. రబడా వేసిన మరుసటి ఓవర్‌లో మరో భారీ సిక్సర్ బాదాడు. ఆ తర్వాత కూడా అతను ఇదే జోరు చూపెట్టడంతో పవర్‌ప్లేలో ఢిల్లీ వికెట్ నష్టపోకుండా 56 రన్స్ చేసింది.
వెంకీ హాఫ్ సెంచరీ
అనంతరం అదే జోరు కనబర్చిన ఈ జోడీ.. స్కోర్ బోర్డు పరుగెత్తించింది. ఈ క్రమంలో అక్షర్ వేసిన 11వ ఓవర్‌లో సింగిల్‌తో వెంకటేశ్ అయ్యర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని రబడా విడదీసాడు. అయ్యర్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చడంతో తొలి వికెట్‌కు నమోదైన 96 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నితీశ్ రాణా భారీ షాట్లతో దూకుడు కనబర్చాడు.
చెలరేగిన రబడా, నోర్జ్..
అయితే అతనికి నోర్జ్ కళ్లెం వేసాడు. క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ మరుసటి ఓవర్‌లో హాఫ్ సెంచరీకి చేరువైన గిల్(46) అవేశ్ ఖాన్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చడంతో మ్యాచ్‌పై ఢిల్లీ పట్టుబిగించింది. రబడా వేసిన 18వ ఓవర్‌లో ఓ వికెట్ తీసి 1 పరుగు మాత్రమే ఇవ్వడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. చివరి 12 బంతుల్లో కేకేఆర్ విజయానికి 10 పరుగులు అవసరమవ్వగా.. అన్రిచ్ నోర్జ్ వేసిన 19వ ఓవర్‌లో నోర్జ్ మూడు పరుగులిచ్చే ఓ వికెట్ తీయడంతో మ్యాచ్ పూర్తిగా ఢిల్లీ వైపు మళ్లీంది.
పాపం అశ్విన్
చివరి ఓవర్‌లో ఢిల్లీ విజయానికి 7 పరుగులు అవసరం కాగా.. బంతిని అందుకున్న అశ్విన్ వరుసగా రెండు వికెట్లు తీశాడు. దాంతో చివరి రెండు బంతులకు కేకేఆర్ విజయానికి 6 పరుగులు అవసరమయ్యాయి. అయితే రాహుల్ త్రిపాఠి భారీ సిక్సర్ కొట్టడంతో కేకేఆర్ విజయాన్నందుకొని ఫైనల్ చేరింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications