For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KKR vs DC:చేలరేగిన బౌలర్లు.. తడబడ్డ ఢిల్లీ.. కోల్‌కతా ముందు ఈజీ టార్గెట్!

Shreyas Iyer cameo takes Delhi to 135 for 5 in Sharjah

షార్జా: కీలక మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ స్పిన్నర్లు మరోసారి చెలరేగడంతో ఢిల్లీ క్యాపిటల్స్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన ఢిల్లీ ప్రత్యర్థి ముందు 136 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలలో 5 వికెట్లకు 135 రన్స్ చేసింది. శ్రేయస్ అయ్యర్(27 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 30 నాటౌట్), శిఖర్ ధావన్(39 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 36) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ రెండు వికెట్లు తీయగా.. ఫెర్గూసన్, శివం మావి తలో వికెట్ పడగొట్టారు.

ఇన్నింగ్స్ ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనర్లు శిఖర్ ధావన్, పృథ్వీ షా ధనాధన్ బ్యాటింగ్‌తో శుభారంభం అందించారు. షకీబ్ వేసిన ఫస్ట్ ఓవర్‌లో సింగిల్ మాత్రమే తీసిన ఈ జోడీ.. ఫెర్గూసన్ బౌలింగ్‌లో బౌండరీతో 5 పరుగులు మాత్రమే చేసింది. షకీబ్ వేసిన మూడో ఓవర్‌లో పృథ్వీ షా 6, 4తో 10 పరుగులు పిండుకోగా.. నరైన్ వేసిన నాలుగో ఓవర్‌లో ధావన్ రెండు భారీ సిక్సర్లు బాదాడు. దాంతో 4 ఓవర్ల ముగిసేసరికి ఢిల్లీ 32 రన్స్ చేసింది.

అయితే బంతిని అందుకున్న వరుణ్ చక్రర్తీ తన ఫస్ట్ బాల్‌కే పృథ్వీ షా(18) ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. దాంతో ఢిల్లీ పతనం మొదలైంది. క్రీజులోకి స్టోయినిస్ రాగా.. పవర్ ప్లేలో ఢిల్లీ వికెట్ నష్టానికి 38 రన్స్ మాత్రమే చేసింది. ఆ తర్వాత ఓవైపు స్పిన్నర్లు మరోవైపు పేసర్లు కట్టడిగా బౌలింగ్ చేయడంతో పరుగులు తీయడానికి ఢిల్లీ బ్యాట్స్‌మన్ తీవ్రంగా కష్టపడ్డారు.

దాంతో తీవ్ర ఒత్తిడికి గురైన స్టోయినిస్ భారీ షాట్ ఆడే ప్రయత్నంలో శివం మావి బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయ్యర్ క్రీజులోకి వచ్చినా అదే తడబాటు కొనసాగింది. భారీ షాటే ఆడే ప్రయత్నం చేసిన ధావన్ సైతం వరుణ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. వస్తూ వస్తూనే బౌండరీ బాదిన పంత్.. అదే జోరులో భారీ షాట్‌కు యత్నించి క్యాచ్ ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చిన హెట్‌మైర్.. వరుణ్ వేసిన 17వ ఓవర్‌లో శుభ్‌మన్ గిల్ సూపర్ క్యాచ్‌కు ఔటయ్యాడు.

అయితే ఆ బంతి నోబాల్ కావడంతో మైదానం వీడిన హెట్‌మైర్‌ను అంపైర్లు మళ్లీ బ్యాటింగ్‌కు ఆహ్వానించారు. ఈ అవకాశాన్ని అందుకున్న అతను ఫెర్గూసన్ వేసిన 18వ ఓవర్‌లో రెండు భారీ సిక్స్‌లు బాదాడు. నరైన్ వేసిన 19వ ఓవర్‌లో హెట్‌మైర్ లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు. దాంతో ఆ ఓవర్‌లో 6 పరుగులు మాత్రమే వచ్చాయి. ఇక మావి వేసిన చివరి ఓవర్‌లో అయ్యర్, 4, 6తో 15 పరుగులు పిండుకోవడంతో ఢిల్లీ 135 పరుగులు చేయగలిగింది.

Story first published: Wednesday, October 13, 2021, 21:23 [IST]
Other articles published on Oct 13, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+