Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR vs DC: అందుకే పృథ్వీ షాను తీసుకున్నాం: రిషభ్ పంత్

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా కోల్‌కతా‌ నైట్‌రైడర్స్(కేకేఆర్)తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఢిల్లీ క్యాపిటల్స్ సారథి రిషభ్ పంత్ తెలిపాడు.

'మేం ముందుగా బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసేందుకు మా జట్టు సిద్దంగా ఉంది. భారీ స్కోర్ చేయాలనుకుంటోంది. వికెట్ కాస్త స్లోయర్‌గా కనిపిస్తోంది. పృథ్వీ షా రీఎంట్రీ ఇవ్వగా.. కుశాగ్ర దూరమయ్యాడు. ముఖేష్ స్థాంలో రాస్ ఖ్ ధార్ వచ్చాడు.'అని రిషభ్ పంత్ తెలిపాడు.

KKR vs DC Rishabh Pant reveals the reason why Prithvi Shaw included in Delhi Playing XI vs Kolkata

మరోవైపు టాస్ గెలిస్తే తాము బౌలింగ్ చేయాలనుకున్నామని కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. టాస్‌కు ముందే రిషభ్ పంత్, నేను మాట్లాడుకున్నాం. అతను బ్యాటింగ్ తీసుకోవాలనుకుంటున్నానని చెబితే.. నేను బౌలింగ్ తీసుకుంటానని తెలిపాను.

పరిస్థితులన్నింటీని సాధారణంగా ఉంచేందుకు మేం ప్రయత్నిస్తాం. 260 పరుగులు చేసి కూడా మ్యాచ్ ఓడితే ఆటగాళ్ల ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. అయితే ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేస్తున్నాం. మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా జట్టులోకి వచ్చారు.'అని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.

తుది జట్లు:
కేకేఆర్: ఫిలిప్ సాల్ట్, సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, రమణ్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తీ

ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, జేక్ ఫ్రెజర్ మెక్‌గర్క్, అభిషేక్ పోరెల్, షైహోప్, రిషభ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రసిఖ్ దార్ సలామ్, లిజాడ్ విలియమ్స్, ఖలీల్ అహ్మద్

Story first published: Monday, April 29, 2024, 19:22 [IST]
Other articles published on Apr 29, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+