ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 154 పరుగుల స్వల్ప లక్ష్యాన్నే నమోదు చేసింది. వరుణ్ చక్రవర్తీ(3/16) తీన్మార్ బౌలింగ్‌కు వైభవ్ అరోరా(2/29), హర్షిత్ రాణా(2/27) రెండేసి వికెట్లతో చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 153 పరుగులు చేసింది.
రిషభ్ పంత్(20 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 27), కుల్దీప్ యాదవ్(26 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 34 నాటౌట్)టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.

శుభారంభం లేదు..
0టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. వైభవ్ అరోరా వేసిన రెండో ఓవర్‌లోనే పృథ్వీ షా(13) కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే డేంజరస్ జేక్ ఫ్రెజర్-మెక్‌గర్క్(12)ను మిచెల్ స్టార్క్ క్యాచ్ ఔట్ చేయగా.. షైహోప్(6)ను వైభవ్ అరోరా క్లీన్ బౌల్డ్ చేశాడు.
క్రీజులోకి వచ్చిన అభిషేక్ పోరెల్(18) దూకుడుగా ఆడటంతో పవర్ ప్లేలో ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్లకు 67 పరుగులు చేసింది. ఆ వెంటనే దూకుడుగా ఆడుతున్న అభిషేక్ పోరెల్‌ను హర్షిత్ రాణా స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ నిర్లక్ష్యపు షాట్లు ఆడాడు. వేగంగా పరుగులు చేయాలనే ఉద్దేశంతో ప్రతీ బంతి గాల్లోకి లేపే ప్రయత్నం చేశాడు.

వరుణ్ చక్రవర్తీ తీన్మార్..
హర్షిత్ రాణా రూపంలో ఓ లైఫ్ లభించినా.. సద్వినియోగం చేసుకోలేకపోయాడు. వరుణ్ చక్రవర్తీ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత ట్రిస్టన్ స్టబ్స్(4)ను వరుణ్ చక్రవర్తీ ఔట్ చేయగా.. అక్షర్ పటేల్(15)ను సునీల్ నరైన్ పెవిలియన్ చేర్చాడు. ఈ పరిస్థితుల్లో కుమార్ కుశాగ్ర(1)నుఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దింపగా.. అతను తీవ్రంగా నిరాశపరిచాడు.
వరుణ్ చక్రవర్తీ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. కుల్దీప్ యాదవ్(8 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 16 నాటౌట్).. రసీక్ సలామ్(8)తో కలిసి 9వ వికెట్‌కు 29 పరుగులు జోడించడంతో పాటు చివరి ఓవర్‌లో 10 పరుగులు చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ 150 పరుగుల మార్క్ అందుకుంది.