For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KKR vs DC: హవ్వా.. ఆ క్యాచ్ ఎలా వదిలావ్‌ రా అయ్యా? గంభీర్ రియాక్షన్ వైరల్!

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కేకేఆర్ ప్లేయర్ హర్షిత్ రాణా చేసిన తప్పిదం ఢిల్లీ క్యాపిటల్స్‌కు కలిసి వచ్చింది. ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్ ఇచ్చిన లడ్డూ లాంటి క్యాచ్‌ను హర్షిత్ రాణా నేలపాలు చేశాడు.

సునాయస క్యాచ్‌ను హర్షిత్ రాణా అందుకోలేకపోవడం చూసి అంతా షాకయ్యారు. ఢిల్లీ క్యాపిటల్స్ డగౌట్‌తో పాటు కేకేఆర్ మెంటార్ గౌతమ్ గంభీర్ హవ్వా.. అంటూ నోరు మూసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

KKR vs DC Gautam Gambhir Reaction Goes Viral After Harshit Rana Dropped Rishabh Pant Catch In IPL 2024

అసలేం జరిగిందంటే..?
వరుణ్ చక్రవర్తీ వేసిన 9వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతిని చక్రవర్తీ లెంగ్త్‌లో వేయగా.. పంత్ స్వీప్ షాట్ ఆడాడు. మిస్ టైమ్ అయిన బ్యాట్ ఎడ్జ్ తాకి ఓవర్ షార్ట్ ఫైన్ లెగ్ దిశగా గాల్లోకి లేచింది. షార్ట్ థర్డ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న హర్షిత్ రాణా కుడివైపు జరిగి క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు.

కానీ లడ్డూ లాంటి క్యాచ్‌ను అందుకోలేకపోయాడు. దాంతో అందరూ అవాక్కయ్యారు. అలా ఎలా? క్యాచ్ వదిలావు రా అయ్యా? అని అందరూ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారు. వరుణ్ చక్రవర్తీ అయితే తన కళ్లను పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయాడు. ఈ క్యాచ్ పట్టుంటే పంత్ 18 పరుగులకే ఔటయ్యేవాడు. ఈ అవకాశంతో చెలరేగిన అతను వైభవ్ అరోరా వేసిన మరుసటి ఓవర్‌లో రెండు బౌండరీలు బాదాడు.

అయితే వరుణ్ చక్రవర్తీ తన మరుసటి ఓవర్‌లోనే క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో హర్షిత్ రాణా ఊపిరి పీల్చుకున్నాడు. పంత్ వికెట్‌తో ఢిల్లీ 93 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులో ట్రిస్టన్ స్టబ్స్‌తో పాటు అక్షర్ పటేల్ ఉన్నారు.

Story first published: Monday, April 29, 2024, 20:53 [IST]
Other articles published on Apr 29, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+