
8 మందికే రూ.77 కోట్లు
ఐపీఎల్ 2022 మెగా వేలంలో కేకేఆర్ ఆలోచన లేకుండా వ్యవహరించింది. నలుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకోని రూ.42 కోట్లు ఖర్చుపెట్టిన కేకేఆర్.. మరో నలుగురు కోసం ఏకంగా రూ.35 కోట్లు ఖర్చుపెట్టింది. దాంతో మిగిలిన రూ.13 కోట్లలో 17 మంది ప్లేయర్లను మాత్రమే తీసుకుంది. అయితే గత సీజన్‌లో ఫైనల్ చేరిన తమ టీమ్ నుంచి ఏకంగా 8 మంది ఆటగాళ్లను ఆ జట్టు కొనుగోలు చేసింది. ఇయాన్ మోర్గాన్, దినేశ్ కార్తీక్, షకీబ్ అల్ హసన్, శుభ్‌మన్ గిల్ మినహా మిగతా ఆటగాళ్లంతా ఉన్నారు. లక్కీగా శ్రేయస్ అయ్యర్(రూ.12.25 కోట్లకే), ప్యాట్ కమిన్స్(రూ.7.25 కోట్లు)లను తక్కువ ధరకు సొంతం చేసుకున్న కేకేఆర్.. నితీశ్ రాణా, శివం మావీల కోసం బాగా ఖర్చు చేసింది. 8 మంది ప్రధాన ఆటగాళ్లను తీసుకున్న ఆ జట్టు మిగతా 17 స్థానాలను సాధారణ ఆటగాళ్లతో నింపేసింది.

ప్రధాన టీమ్ సూపర్..
8 మంది స్టార్ ఆటగాళ్లను తీసుకోవడంతో ఆ జట్టు ప్రధాన టీమ్ బలంగా కనిపిస్తోంది. మిగతా మూడు స్లాట్‌లను ఫస్ట్‌రౌండ్‌లో అన్‌సోల్డ్‌గా నిలిచిన ఎక్స్‌పీరియన్స్‌డ్ ప్లేయర్లతో నింపేసింది. ఉమేశ్ యాదవ్, అజింక్యా రహానేలతో పాటు టీమ్ సౌథీలను తీసుకుంది. షెల్డన్ జాక్సన్, రింకూ సింగ్, అశోక్ శర్మ, అనుకుల్ రాయ్, బాబా ఇంద్రజిత్, రమేశ్ కుమార్, పార్థమ్ సింగ్ వంటి దేశవాళీ ఆటగాళ్లను కనీస ధరకే కొనుగోలు చేసింది. రమేశ్ కుమార్‌కు దేశవాళీ క్రికెట్ ఆడిన అనుభవం లేకున్నా.. అతని టెన్నిస్ బాల్ ప్రదర్శనలను చూసి ఎంపిక చేసింది. చాలా పేద కటుంబం నుంచి వచ్చిన రమేశ్ కుమార్ ఏమేరకు రాణాస్తాడో చూడాలి.

బ్యాకప్ బలహీనం..
ప్రధాన టీమ్ బలంగానే ఉన్నప్పటికీ బ్యాకప్ బలహీనంగా కనిపిస్తోంది. ప్రధాన ఆటగాళ్లు గాయపడితే జట్టుకు కష్టాలు తప్పేలా లేవు. జట్టులో అంతగా అనుభవం లేని, ఫామ్‌లోని ఆటగాళ్లే ఉండటంతో బ్యాకప్ బలహీనంగా కనిపిస్తోంది. వికెట్ కీపర్స్ సామ్ బిల్లింగ్స్, షెల్డన్ జాక్సన్, బాబా ఇంద్రజిత్‌లు ఉన్నారు. ఓపెనింగ్ స్లాట్ కూడా వీక్‌గానే ఉంది. ఇటీవల హిట్టర్‌గా మారిన అయ్యర్.. మళ్లీ ఓపెనింగ్ చేస్తాడా? లేదా? అనేది సందేహం. సునీల్ నరైన్‌తో ఓపెనింగ్ చేస్తే అతనికి తోడుగా ఎవరిని ఆడించాలనేది సందేహంగా మారింది. అనుభవం కలిగిన రహానే జట్టులో ఉన్నా.. వేగంగా ఆడటం సందేహమే.

ఓపెనర్లుగా నరైన్, వెంకటేశ్..
ఇక కేకేఆర్ తుది జట్టు అంచనాను పరిశీలిస్తే.. వెంకటేశ్ అయ్యర్, నరైన్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. వెంకటేశ్‌ను ఫినిషర్ రోల్‌లో ఆడిస్తే.. అలెక్స్ హేల్స్, రహానేల్లో ఒకరు ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఫస్ట్ డౌన్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బరిలోకి దిగనుండగా.. నితీష్ రాణా నాలుగో స్థానంలో ఆడనున్నాడు. వికెట్ కీపర్‌గా సామ్ బిల్లింగ్స్ ఐదో స్థానంలో ఆడనున్నాడు. అయితే ఓవర్‌సీస్ కోటాలో ఇతరులను తీసుకోవాలని భావిస్తే బిల్లింగ్స్ బదులు షెల్డన్ జాక్సన్‌కు తుది జట్టులో చోటు దక్కవచ్చు. ఆ తర్వాత ఆండ్రీ రస్సెల్ ఆడనున్నాడు. పేసర్లుగా ప్యాట్ కమిన్స్, ఉమేశ్ యాదవ్, శివం మావి ఆడనుండగా.. ఏకైక స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తీ ఆడనున్నాడు.

కేకేఆర్ తుది జట్టు(అంచనా)
వెంకటేశ్ అయ్యర్, అజింక్యా రహానే/అలెక్స్ హేల్స్, శ్రేయస్ అయ్యర్, నితీశ్ రాణా, సామ్ బిల్లింగ్స్/షెల్డన్ జాక్సన్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, ప్యాట్ కమిన్స్, ఉమేశ్ యాదవ్, శివం మావి, వరుణ్ చక్రవర్తీ.

కేకేఆర్ పూర్తి టీమ్..
శ్రేయస్ అయ్యర్(రూ.12.25 కోట్లు), నితీశ్ రాణా(రూ.8 కోట్లు), ప్యాట్ కమిన్స్(రూ.7.25 కోట్లు), శివం మావి(రూ.7.25 కోట్లు), సామ్ బిల్లింగ్స్(రూ.2 కోట్లు), ఉమేశ్ యాదవ్(రూ.2 కోట్లు), అలెక్స్ హేల్స్(రూ.1.50 కోట్లు), టీమ్ సౌథీ(రూ.1.50 కోట్లు), మహమ్మద్ నబీ(రూ. కోటి), అజింక్యా రహానే(రూ. కోటి), షెల్డన్ జాక్సన్ (రూ.60 లక్షలు), రింకూ సింగ్(రూ.55 లక్షలు), అశోక్ శర్మ(రూ.55 లక్షలు), చమిక కరుణరత్నే(రూ.50 లక్షలు), అభిజిత్ తోమర్(రూ.40 లక్షలు), అనుకుల్ రాయ్(రూ.20 లక్షలు), రసిఖ్ దార్(రూ.20 లక్షలు), బాబా ఇంద్రజిత్(రూ.20 లక్షలు), అమన్ ఖాన్(రూ.20 లక్షలు), రమేశ్ కుమార్(రూ.20 లక్షలు), పార్థమ్ సింగ్(రూ.20 లక్షలు)


Click it and Unblock the Notifications












