Venkatesh Iyer: తెలుగు హీరోయిన్‌తో కేకేఆర్ ఆల్‌రౌండర్ ప్రేమాయణం!


న్యూఢిల్లీ: సినిమా, క్రికెట్‌కు విడదీయని బంధం ఉంది. సినిమా హీరోయిన్లతో స్టార్ క్రికెటర్లు ప్రేమాయణం నడపడం కొత్త కాదు. నాటి పటౌడి నుంచి నేటి విరాట్ కోహ్లీ వరకు సినీ హీరోయిన్లతో ప్రేమ వ్యవహారాలు నడిపి పెళ్లి చేసుకున్నవారే. ఏదో ఒక ఈవెంట్లో కలుసుకోవడం.. ఆ తర్వాత వారి మధ్య స్నేహం చిగురించి ప్రేమగా మారటం సర్వసాధారణం అయిపోయింది.
తాజాగా ఆ జాబితాలో చేరేందుకు టీమిండియా యువ క్రికెటర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ ఉవ్విళ్లూరుతున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్‌తో ప్రేమాయణానికి అతను సిద్ధమయ్యాడనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

క్యూట్ అంటూ కామెంట్..
ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్‌హాట్ ఫొటోలను షేర్ చేస్తూ టాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసి ఓ హాట్ ఫొటోకు వెంకటేశ్ అయ్యర్ కామెంట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. వెంకటేశ్ అయ్యర్, జవాల్కర్ మధ్య సమ్‌థింగ్, సమ్‌థింగ్ ఉందంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తున్నారు. ఉగాది సందర్భంగా ప్రియాంక షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌కు వెంకటేశ్ అయ్యర్ క్యూట్ అంటూ కామెంట్ చేశాడు. దీనికి జవాల్కర్.. 'ఎవరు? నువ్వా'.. అంటూ రిప్లై ఇచ్చింది.

టాక్సీవాలాతో..
వెంకటేశ్ అయ్యర్ కామెంట్, జవాల్కర్ రిప్లైలకు వేల సంఖ్యలో లైకులు, రిప్లైలు వచ్చాయి. ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి. టాక్సీవాలా సినిమాతో క్రేజ్ సంపాదించిన ప్రియాంక జవాల్కర్, గతేడాది విడుదలైన ఎస్ఆర్ కల్యాణమండపంతో అలరించింది. మరిన్నీ అప్‌కమింగ్ చిత్రాలలోనూ నటిస్తుంది.

అనూహ్యంగా దూసుకొచ్చి..
ఐపీఎల్ 2021 సీజన్లో కేకేఆర్ తరఫున బరిలోకి దిగిన వెంకటేశ్ అయ్యర్ అనూహ్య ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. యూఏఈ వేదికగా జరిగిన సెకండాఫ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన అతను జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఫస్టాఫ్‌లో వరుసగా విఫలమైన ఆటీమ్ వెంకటేశ్ అయ్యర్ రాకతో ఏకంగా ఫైనల్‌కే దూసుకెళ్లింది. ఈ స్టన్నింగ్ పెర్ఫామెన్స్‌తో వెంకటేశ్ ఆ తర్వాత టీమిండియాలోనూ చోటు సంపాదించాడు. ఐపీఎల్ 2022 సీజన్ రిటెన్షన్‌లో భాగంగా వెంకటేశ్ అయ్యర్‌ను రూ.6 కోట్లకు కేకేఆర్ రిటైన్ చేసుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications