Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కేకేఆర్ ఆల్‌రౌండర్‌కు జాక్‌పాట్

కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఆల్‌రౌండర్ అనుకుల్ రాయ్‌‌కు జాక్‌పాట్ వరించింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో కేకేఆర్ తరఫున మెరుగైన ప్రదర్శన కనబర్చడంతో ఈ జార్ఖండ్ ప్లేయర్‌కు టీమిండియా పిలుపు దక్కింది. శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత్-ఏ జట్టులో అనూహ్యంగా చోటు లభించింది.

శ్రీలంక-ఏ, అఫ్గానిస్థాన్-ఏతో భారత్ ఏ జట్టు ముక్కోణపు వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు ఎంపిక చేసిన భారత్-ఏ జట్టులో ముందుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పిన్ ఆల్‌రౌండర్ హర్ష్‌దూబేకు అవకాశం కల్పించారు. అయితే ఐపీఎల్ 2026 అనంతరం సొంతగడ్డపై అఫ్గానిస్థాన్‌తో జరిగే ఏకైక టెస్ట్‌తో పాటు మూడు వన్డేల సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో హర్ష్‌దూబేకు చోటు దక్కింది. దాంతో అతన్ని భారత్-ఏ జట్టు నుంచి రిలీజ్ చేసిన భారత సెలెక్టర్లు అనుకుల్ రాయ్‌కు అవకాశం కల్పించారు.

ఇండియా A, శ్రీలంక A, ఆఫ్ఘనిస్తాన్ A జట్ల మధ్య జూన్ 9 నుంచి జూన్ 21 వరకు ముక్కోణపు వన్డే సిరీస్ జరగనుంది. 'భారత సెలక్షన్ కమిటీ శ్రీలంకలో జరగనున్న ట్రై-సిరీస్ కోసం ఇండియా A జట్టులోకి అనుకుల్ రాయ్‌ను తీసుకుంది’ అని బీసీసీఐ ప్రకటించింది.

KKR Star Anukul Roy Named as Harsh Dubey s Replacement in India A Squad for Sri Lanka tri-series

ఐపీఎల్ 2026 సీజన్‌లో అనుకుల్ రాయ్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో కేకేఆర్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడిన అనుకూల్ రాయ్.. ఎనిమిది వికెట్లు తీసాడు.

అంతకుముందు జార్ఖండ్ తరపున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ అనుకుల్ రాయ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచి ఆ జట్టు ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డును అందుకున్నాడు. ఈ ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.

శ్రీలంక పర్యటనలో భారత్-ఏ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. రియాన్ పరాగ్‌ అతనికి డిప్యూటిగా ఉండనున్నాడు. భారత్-ఏ తరఫున సత్తా చాటే ఆటగాళ్లకు సీనియర్ టీమ్‌లో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఈ శ్రీలంక పర్యటనను సెలెక్టర్లు నిశితంగా పరిశీలించనున్నారు.

శ్రీలంక పర్యటనకు ఎంపికైన భారత్-ఏ జట్టు(అప్‌డేట్): తిలక్ వర్మ (కెప్టెన్), ప్రియాన్ష్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ (వైస్ కెప్టెన్), ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, సూర్యాంష్ షెడ్జ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (కీపర్), కుమార్ కుశాగ్ర (కీపర్), విప్రాజ్ నిగమ్, యష్ ఠాకూర్, యుద్ధ్వీర్ సింగ్, అన్షుల్ కంబోజ్, అర్షద్ ఖాన్, అనుకుల్ రాయ్.

Story first published: Thursday, May 21, 2026, 17:08 [IST]
Other articles published on May 21, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+