
హైదరాబాద్: వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్.. ఒక్క పోస్ట్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. సోషల్ మీడియా వేదికగా తన నగ్న ఫొటోను షేర్ చేశాడు. దాంతో అభిమానులు అవాక్కయ్యారు. ఇదెక్కడి పోయే కాలంరా? అయ్యా అంటూ ఫ్యాన్స్ సెటైర్లు పేల్చుతున్నారు. న్యూడ్‌గా తీసుకున్న సెల్ఫీని రస్సెల్ తన ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్నాడు. అద్దం ముందు నిల్చొని ఈ ఫొటో తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తన జననాంగం కనబడకుండా పుర్రె బొమ్మ ఎమోజీతో కవర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. అభిమానులు ఫన్నీ కామెంట్స్‌తో సెటైర్లు పేల్చుతున్నారు.
బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ న్యూడ్ ఫొటో షూట్‌కు మించినది ఈ ఫోటోనని కామెంట్ చేస్తున్నారు. రణ్‌వీర్ సింగ్ న్యూడ్ ఫొటో షూట్‌కు ఇది లైట్ వర్షన్ అని సెటైర్లు పేల్చుతున్నారు. ఇక ఐపీఎల్ 2023 సీజన్ కోసం కేకేఆర్.. రస్సెల్‌ను రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న రస్సెల్.. ఫిట్‌నెస్‌పై సీరియస్‌గా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. జిమ్‌లో గంటలు తరబడి చెమటోడ్చుతున్నాడు. వర్కౌట్స్‌కు సంబంధించిన సెల్ఫీని కూడా రస్సెల్ అభిమానులతో పంచుకున్నాడు.
ముఖ్యంగా తన లోయర్ బాడీ బలహీనంగా ఉంటుందని చాలా సార్లు చెప్పిన రస్సెల్.. ఆ బలహీనతను అధిగమించే ప్రయత్నం చేస్తున్నాడు.అమ్మాయిల పిచ్చి, లైంగిక వాంఛతో చెసిన తప్పిదం తనను ఇప్పటికీ వెంటాడుతోందని రస్సెల్ గతంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 9 ఏళ్ల క్రితం తనకున్న అమ్మాయిల పిచ్చి, లైంగిక వాంఛతో తన మొకాలి గాయాన్ని పట్టించుకోలేదని, ఇప్పుడు అది పెద్ద సమస్యగా మారి తనను వేధిస్తొందని రస్సెల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
'నా తరహాలో శరీర సౌష్టవం కావాలని ఆశపడే వారు.. నేను చేసిన తప్పు మాత్రం చేయొద్దు. నాకు 23-24 ఏళ్ల వయసులో చిన్నగా మోకాలి నొప్పి వచ్చింది. అప్పట్లో నేను దాన్ని పట్టించుకోలేదు. కేవలం భుజం, ఛాతి పెద్దగా కనిపించేందుకు మాత్రమే ఎక్కువగా జిమ్‌లో కష్టపడేవాడ్ని. ఆ వయసులో అమ్మాయిలకి సెక్సీగా కనిపించాలనే తాపత్రయం నాలో ఉండేది' అని రసెల్ తెలిపాడు..
ఇక టీ20 ప్రపంచకప్ 2022కు రస్సెల్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అతనితో పాటు సునీల్ నరైన్, హెట్‌మైర్ కూడా ఆడకపోవడంతో వెస్టిండీస్ జట్టు క్వాలిఫయర్స్‌లోనే వెనుదిరిగింది.