ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఐపీఎల్ 2025 రిటెన్షన్ జాబితాలు విడుదలయ్యాయి. ఈ రిటెన్షన్ జాబితాల సమర్పణకు నేటి(గురువారం)తో గడువు ముగియడంతో ఐపీఎల్ అధికారిక బ్రాడ్‌కాస్టర్స్ స్టార్ స్పోర్ట్స్, జియోసినిమాలు 10 జట్ల రిటెన్షన్ జాబితాలను ప్రకటించాయి. ఒక్కో జట్టు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల వివరాలను వెల్లడించాయి. అందరూ ఊహించినట్లుగానే డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్) రిటెన్షన్ జాబితాల విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకుంది.
టైటిల్ అందించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో పాటు గత వేలంలో ఆల్‌టైమ్ రికార్డ్ ధర రూ. 24.75 కోట్లకు కొనుగోలు చేసిన మిచెల్ స్టార్క్‌లను కేకేఆర్ వేలంలోకి వదిలేసుకుంది.

విధ్వంసకర స్పిన్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్, బ్యాటింగ్ సెన్సేషన్ రింకూ సింగ్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీతో పాటు యువ బౌలర్, అనామక ప్లేయర్ హర్షిత్ రాణాతో పాటు మరో అనామక ఆల్‌రౌండర్ రమణ్‌దీప్ సింగ్‌లను రిటైన్ చేసుకుంది.
ఈ నలుగురి ఆటగాళ్ల కోసం కేకేఆర్ రూ. 57 కోట్లు ఖర్చు చేసింది. తమ టాప్ ప్లేయర్‌గా రింకూ సింగ్‌ను రూ. 13 కోట్లకు రిటైన్ చేసుకున్న కేకేఆర్.. వరుణ్ చక్రవర్తీ, సునీల్ నరైన్‌లను రూ. 12 కోట్లకు అట్టిపెట్టుకుంది.
ఆండ్రీ రస్సెల్‌ను వదిలేసినట్లు ప్రచారం జరిగినా.. అందులో వాస్తవం లేదని స్పష్టమైంది. అతన్ని మళ్లీ రూ. 12 కోట్లకు జట్టులో కొనగోలు చేసింది. ఐపీఎల్ 2022 మెగా వేలంలోనూ రస్సెల్‌ను కేకేఆర్ రూ. 12 కోట్లకే రిటైన్ చేసుకోవడం గమనార్హం. అనామక ఆటగాళ్లు అయిన హర్షిత్ రాణా, రమణ్‌దీప్ సింగ్‌లను రూ. 4 కోట్లుకు రిటైన్ చేసుకుంది.
ఆ జట్టు వద్ద ఇంకా రూ.63 కోట్ల పర్స్ మనీ ఉంది. ఆరుగురికి ఆరుగురిని రిటైన్ చేసుకున్న కేకేఆర్‌కు ఎలాంటి ఆర్‌టీఎమ్ కార్డ్ లేదు.
కేకేఆర్ రిటెన్షన్ లిస్ట్:
రింకూ సింగ్-రూ. 13 కోట్లు
వరుణ్ చక్రవర్తీ- రూ. 12 కోట్లు
సునీల్ నరైన్-రూ. 12 కోట్లు
ఆండ్రీ రస్సెల్-రూ. 12 కోట్లు
హర్షిత్ రాణా-రూ. 4 కోట్లు
రమణ్‌దీప్ సింగ్-రూ. 4 కోట్లు
రిటెన్షన్ ఖర్చు అయిన డబ్బులు: రూ. 57 కోట్లు
పర్స్‌లో మిగిలి ఉన్న డబ్బులు: రూ. 63 కోట్లు
కేకేఆర్ రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితా:
బ్యాటర్లు: శ్రేయస్ అయ్యర్, రెహ్మనుల్లా గుర్బాజ్, నితీష్ రాణా, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, ఫిల్ సాల్ట్(కీపర్), కేఎస్ భరత్(కీపర్), మనీష్ పాండే, అంగ్‌క్రిష్ రఘువంశీ
ఆల్‌రౌండర్స్: అనుకుల్ రాయ్, వెంకటేశ్ అయ్యర్
బౌలర్లు: సుయాష్ శర్మ, అల్లా ఘజన్‌ఫర్, దుష్మంత్ చమీరా, షకీబ్ హుస్సేన్, వైభవ్ అరోరా, మిచెల్ స్టార్క్, చేతన్ సకారియా.