Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023: చెన్నైపై విజయం.. కోల్‌కతా ప్లే ఆఫ్స్ చేరాలంటే..?

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ మరో విజయాన్నందుకుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించి 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఇప్పటికీ ఐపీఎల్‌-16 ప్లేఆఫ్స్‌ చేరడం చాలా చాలా కష్టమే అయినా.. అద్భుతం జరిగితే కేకేఆర్ టోర్నీలో ముందడుగు వేసే అవకాశం ఉంది.

13 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో ఏడో స్థానంలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ చివరి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో మే20న తలపడనుంది. ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధిస్తే కేకేఆర్‌కు 14 పాయింట్లు వస్తాయి. ఇతర మ్యాచ్ ఫలితాలు కేకేఆర్‌కు అనుకూలంగా ఉంటే ప్లే ఆఫ్స్ చేరవచ్చు.

Kolkata Knight Riders

తదుపరి మ్యాచ్‌ల్లో గుజరాత్ టైటాన్స్ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్, గుజరాత్ టైటాన్స్ చేతిలో ఆర్‌సీబీ ఓడిపోతే పరిస్థితులు కేకేఆర్‌కు అనుకూలంగా ఉంటాయి. అయితే పంజాబ్ కింగ్స్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ ఓడితే 14 పాయింట్లతో కేకేఆర్, పంజాబ్ మధ్య రన్‌రేట్ కీలకం కానుంది.

కాబట్టి తదుపరి మ్యాచ్‌లో కేకేఆర్ మెరుగైన రన్‌రేట్‌తో గెలిస్తే ప్లే ఆఫ్స్ చేరవచ్చు. ఇలా జరగడం అసాధ్యమైనప్పటికీ.. సాంకేతికంగా కేకేఆర్‌కు మాత్రం అవకాశాలున్నాయి.

శనివారం ఆర్‌సీబీ చేతిలో రాజస్థాన్, కేకేఆర్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిన తర్వాత ప్లే ఆఫ్స్ చేరే జట్ల అవకాశాల శాతం స్వల్పంగా మారింది. గుజరాత్ టైటాన్స్ 98 శాతం అవకాశాలుండగా... చెన్నైకి 90 శాతం, ముంబై ఇండియన్స్‌కు 80 శాతం, లక్నో సూపర్ జెయింట్స్‌కు 61 శాతం అవకాశాలున్నాయి. ఆర్‌సీబీ అవకాశాలు 31 శాతానికి పెరగ్గా.. పంజాబ్‌కు 21 శాతం చాన్సెస్ ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ అవకాశాలు 11 శాతంకు పడిపోగా.. కేకేఆర్ 6 శాతం, సన్‌రైజర్స్ 2 శాతానికి పడిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ అధికారికంగా తప్పుకుంది.

Story first published: Monday, May 15, 2023, 11:18 [IST]
Other articles published on May 15, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+