ఐపీఎల్ 2024 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) కీలక పోరుకు సిద్దమైంది. అసాధారణ ప్రదర్శనతో టేబుల్ టాపర్‌గా నిలిచిన కేకేఆర్.. మంగళవారం అహ్మదాబాద్ వేదికగా జరిగే క్వాలిఫయర్-1లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఎలాంటి రిస్క్ లేకుండా ఫైనల్ చేరాలని కేకేఆర్ భావిస్తోంది.
11 మ్యాచ్‌ల్లో 9 విజయాలతో పూర్తి ఆధిపత్యం చెలాయించిన కేకేఆర్.. ప్లే ఆఫ్స్‌లోనూ అదే జోరును కొనసాగించాలనుకుంటుంది. అయితే కేకేఆర్ ఆడాల్సిన చివరి రెండు లీగ్ మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. దాంతో ఆ జట్టుకు రెండు వారాలుగా మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా పోయింది. అంతేకాకుండా కేకేఆర్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన విధ్వంసకర ఓపెనర్ ఫిల్ సాల్ట్ కీలక మ్యాచ్‌లకు దూరమయ్యాడు.

ఫిల్ సాల్ట్ ఔట్..
పాకిస్థాన్‌తో టీ20 సిరీస్ నేపథ్యంలో ఈ ఇంగ్లండ్ బ్యాటర్ స్వదేశం పయనమయ్యాడు. దాంతో అతని స్థానంలో కేకేఆర్ అఫ్గాన్ ఓపెనర్ రెహ్మానుల్లా గుర్బాజ్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ ఒక్క మార్పు మినహా తుది జట్టులో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు. పిచ్‌కు అనుకూలించే అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుండటం కేకేఆర్‌కు కలిసొచ్చే అంశం. అంతేకాకుండా మెంటార్‌గా గౌతమ్ గంభీర్ ఉండటం ఆ జట్టుకు వెయ్యి ఏనుగుల బలం.
పరిస్థితులకు తగ్గట్లు వ్యూహాలు రచించడంతో గంభీర్ దిట్ట. అతని మార్గదర్శకత్వంలోనే కేకేఆర్ వరుస విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. లీగ్ దశలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ కేకేఆర్ విజయం సాధించింది.

భీకరంగా బ్యాటింగ్ లైనప్..
ఫిల్ సాల్ట్ దూరమైనా కేకేఆర్ బ్యాటింగ్ లైనప్ భీకరంగా ఉంది. సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. రింకూ సింగ్ కూడా తన బ్యాటింగ్‌కు పని చెప్పితే కేకేఆర్‌కు తిరుగుండదు. హర్షిత్ రాణా, మిచెల్ స్టార్క్, ఆండ్రీ రస్సెల్‌తో పేస్ విభాగం కూడా పటిష్టంగా ఉంది.
స్పిన్నర్లు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తీలకు తిరుగు లేదు. తుది జట్టులోని ఆటగాళ్లంతా సమష్టిగా రాణిస్తే కేకేఆర్ సునాయస విజయాన్ని అందుకోనుంది. వైభవ్ అరోరాను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించే ఛాన్స్ ఉంది. హెడ్ టు హెడ్ రికార్డ్స్‌లోనూ సన్‌రైజర్స్‌పై కేకేఆర్‌దే పై చేయి కావడం గమనార్హం. ఇరు జట్లు ఇప్పటి వరకు 29 మ్యాచ్‌లు ఆడగా.. కేకేఆర్ 17, సన్‌రైజర్స్ 9 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఓ మ్యాచ్ ఫలితం తేలలేదు.
కేకేఆర్ తుది జట్టు(అంచనా)
రెహ్మానుల్లా గుర్జాజ్(కీపర్), సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణ్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తీ
ఇంపాక్ట్ ప్లేయర్: వైభవ్ అరోరా