For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అజింక్యా రహానే విధ్వంసం.. ఫైనల్ చేరిన ముంబై!

ప్రతిష్టాత్మక దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై ఫైనల్ చేరింది. బరోడాతో శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ముంబై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీమిండియా వెటరన్ బ్యాటర్ అంజింక్యా రహానే(56 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 98) విధ్వంసకర బ్యాటింగ్‌తో ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 158 పరుగులు చేసింది. శశ్వాత్ రావత్(29 బంతుల్లో 4 ఫోర్లతో 33), కృనాల్ పాండ్యా(24 బంతుల్లో 4 ఫోర్లతో 30), శివాలిక్ శర్మ(24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ముంబై బౌలర్లలో మోహిత్ అవస్థీ, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, తనూష్ కోటియన్, అథర్వ అంకోలేకర్ తలో వికెట్ తీయగా.. సుయాన్ష్ షెద్గే రెండు వికెట్లు పడగొట్టాడు.

KKR Feels Happy After Ajinkya Rahane slams 56 ball 98 in Syed Mushtaq Ali Tournament 2024

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ముంబై 17.2 ఓవర్లలో 4 వికెట్లకు 164 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్ పృథ్వీ షా(8) విఫలమవ్వగా.. అజింక్యా రహానే, శ్రేయస్ అయ్యర్(30 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46) రాణించారు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 88 పరుగులు జోడించారు. హాఫ్ సెంచరీ ముంగిట అయ్యర్ ఔటవ్వగా.. అజింక్యా రహానే శతకాన్ని చేజార్చుకున్నాడు. సుర్యాన్ష్ షెద్గే విన్నింగ్ సిక్స్‌తో విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.

బరోడా బౌలర్లలో హార్డిక్ పాండ్యా, అతిత్ షేత్, అభిమన్యుసింగ్ రాజ్‌పుత్, శశ్వాత్ రావత్ తలో వికెట్ తీసారు. విధ్వంసకర బ్యాటింగ్‌తో ముంబై విజయంలో కీలక పాత్ర పోషించిన రహానేకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

ఈ టోర్నీ రహానే అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. వరుసగా 52, 68, 22, 95, 84, 98 పరుగులు చేశాడు. ఈ టోర్నీ ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన రహానే.. 172 స్ట్రైక్‌రేట్‌తో 366 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్ ముంగిట రహానే సూపర్ ఫామ్ కనబర్చడంతో అతన్ని కొనుగోలు చేసిన కేకేఆర్ సంతోషంలో మునిగి తేలుతోంది. రూ. 1.50 కోట్ల కనీస ధరకే రహానేను కేకేఆర్ దక్కించుకుంది. వచ్చే సీజన్‌లో అతనికే సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.

రహానే బ్యాటింగ్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తూ వరుస ట్వీట్లు చేసింది. 'కొన్నిసార్లు 90 పరుగులు కూడా సెంచరీల్లాంటి అనుభూతిస్తాయి. తినడం, పడుకోవడం.. భారీ స్కోర్లు చేయడం రహానే రొటీన్'అని కొనియాడింది.

Story first published: Friday, December 13, 2024, 16:37 [IST]
Other articles published on Dec 13, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+