ఇర్ఫాన్ భాయ్.. నీ మాట మేం విన్నాం: కేకేఆర్

న్యూఢిల్లీ: కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) తమ కొత్త కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్, దిగ్గజ రంజీ కోచ్ చంద్రకాంత్ పండిట్‌ను నియమించింది. ఈ విషయాన్ని బుధవారం ట్విటర్ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇన్నాళ్లు కేకేఆర్ హెడ్ కోచ్‌గా ఉన్న న్యూజిలాండ్ దిగ్గజం బ్రెండన్ మెక్‌కల్లమ్ ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడంతో కేకేఆర్ కొత్త కోచ్‌ను చూసుకుంది. రంజీ క్రికెట్‌లో కోచ్‌గా అపార అనుభవం ఉన్న చంద్రకాంత్ పండిట్‌ను ఎంచుకుంది. ఐపీఎల్ 2023 టైటిలే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది.
పఠాన్ సూచనలతో...
ఈ సీజన్ రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ తొలిసారి విజేతగా అవతరించడంలో కోచ్‌గా చంద్రకాంత్ పండిట్ కీలకపాత్ర పోషించాడు. అంతేకాదు రంజీ క్రికెట్‌లో అత్యంత సూపర్ సక్సెస్ కోచ్‌గా ఆయనకు మంచి పేరు ఉంది. ప్రస్తుత తరుణంలో హెడ్‌కోచ్‌గా చంద్రకాంత్ పండిట్ సరైనవాడని కేకేఆర్ అభిప్రాయపడుతోంది. అందుకే చంద్రకాంత్ పండిట్‌ను ఏరికోరి కేకేఆర్ కోచ్‌గా తీసుకొచ్చింది. అయితే చంద్రకాంత్‌ను కోచ్‌గా నియమించుకున్న నేపథ్యంలో కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశాడు. టీమిండియా దిగ్గజ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సూచలను తాము స్వీకరించామని పేర్కొన్నాడు.

అసలేం జరిగిందంటే..
2021-22 రంజీ ట్రోఫీ మధ్యప్రదేశ్ గెలవడంలో కోచ్‌గా చంద్రకాంత్ పండిట్ కీలక పాత్ర పోషించాడు. మధ్యప్రదేశ్ కెప్టెన్‌గా సాధించలేని టైటిల్‌ను కోచ్‌గా ఆ జట్టుకు అందించాడు. దాంతో చంద్రకాంత్ పండిట్‌పై ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల జల్లు కురిపించాడు. డొమస్టిక్ క్రికెట్‌లో చంద్రకాంత్ పండిట్ మరోసారి తన మ్యాజిక్‌ను రిపీట్ చేశాడని కొనియాడాడు. అతనికి మంచి ఐపీఎల్ కాంట్రాక్టు దక్కాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశాడు. 'రంజీ ట్రోఫీ గెలిచిన మధ్యప్రదేశ్ జట్టుకు అభినందనలు. దేశవాళీ క్రికెట్‌లో చంద్రకాంత్ పండిట్ మరోసారి మ్యాజిక్ చేశాడు. అతనికి మంచి ఐపీఎల్ కాంట్రాక్టు దక్కాలి'అని ట్వీట్‌లో పేర్కొన్నాడు.

పఠాన్‌కు బదులిస్తూ..
ఇక కేకేఆర్ తమ హెడ్ కోచ్‌గా చంద్రకాంత్‌ను ఎంచుకున్న తర్వాత ఆ జట్టు సీఈవో వెంకీ మైసూర్ పఠాన్ ట్వీట్‌ను రీట్వీట్ చేశాడు. 'ఇర్ఫాన్ భాయ్.. నీ మాట మేం విన్నాం'అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక చంద్రకాంత్ పండిట్ భారత్ తరపున 1986-92 వరకు ప్రాతినిధ్యం వహించాడు. భారత్ తరపున చంద్రకాంత్ 5 టెస్టులు, 23 వన్డేలు ఆడాడు. టీమిండియా ఆటగాడిగా అంతగా సక్సెస్ కాలేకపోయిన రంజీ కోచ్‌గా అందరి ప్రశంసలు అందుకున్నాడు. చంద్రకాంత్ రంజీ కోచ్‌గా అడుగుపెట్టాకా ముంబైని(2002-03, 2003-04,2015-16) మూడుసార్లు, విదర్భను(2017-18, 2018-19) రెండుసార్లు రంజీ చాంపియన్‌గా నిలపడంలో కీలకపాత్ర పోషించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications