బౌలింగ్ కాదు.. ఆ తప్పిదమే మా ఓటమికి కారణం: అజింక్యా రహానే
చెత్త బ్యాటింగే తమ ఓటమిని శాసించిందని కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) కెప్టెన్ అజింక్యా రహానే అన్నాడు. తమ ఓటమికి బౌలింగ్ ఏ మాత్రం కారణం కాదని స్పష్టం చేశాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే)తో మంగళవారం చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన కేకేఆర్ 32 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది.
సీఎస్‌కే నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ చేధించలేకపోయింది. నిర్ణీత ఓవర్లలో 160/7 స్కోర్‌కే పరిమితమై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన రహానే.. పేలవ బ్యాటింగే తమ ఓటమికి ప్రధాన కారణమని చెప్పాడు. ముఖ్యంగా పవర్ ప్లేలోనే తమ ఓటమి ఖాయమైందని తెలిపాడు.

మా బ్యాటింగ్‌లో ఊపు లేదు..
'మా బ్యాటింగ్‌లో ఏ మాత్రం ఊపు కనిపించలేదు. ఇది వాస్తవం. బౌలింగ్‌లో మాత్రం మేం బాగా పుంజుకున్నాం. ఈ వికెట్‌పై 190 పరుగులు ఛేదించడం అంత కష్టం కాదు. ముఖ్యంగా పవర్ ప్లేలోనే 70 పరుగులు చేసిన సీఎస్‌కేను 190 పరుగులకే పరిమితం చేయడం మా బౌలింగ్ యూనిట్ అద్భుత ప్రదర్శనతోనే సాధ్యమైంది.
మా బ్యాటింగ్‌లో మేం పవర్ ప్లేలో కనీసం 40 పరుగులు చేయలేకపోయాం. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లను ఎదుర్కోవడం సవాల్‌గా మారింది. వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగానే ఉంది. ఎవరో ఒకరు ఆఖరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్ ముగించాల్సింది.
మాది కఠినమైన పరిస్థితి..
ప్రస్తుతం మేం కఠినమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. మేం వరుసగా మ్యాచ్‌లు ఓడిపోతున్నాం. ఇది బాధకరమైన విషయం. కానీ ఒక జట్టుగా ఈ పరిస్థితుల్లో మేం సానుకూలంగా ఉండటం, ఆత్మవిశ్వాసంతో ఆడటం, ఆటపై ఫోకస్ పెట్టడం ముఖ్యం. మా కాంబినేషన్ గురించి పునరాలోచన చేయాలి. అవసరమైన మార్పులను చేయాలి. ఫలితాలు అనుకూలంగా ఉన్నప్పుడు ఆటగాళ్లను ఎవరూ ఏమనరు. కానీ ఫలితాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు జట్టు కాంబినేషన్ గురించి ఆలోచన చేయక తప్పదు.అయితే సానుకూల దృక్పథంతో ఉండటం అన్నిటి కన్నా ముఖ్యం.
కార్తీక్ త్యాగి అద్బుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. నెట్స్‌లో చాలా కష్టపడుతున్నాడు. అతను గొప్ప ప్రతిభావంతుడు. అతను బౌలింగ్ చేస్తున్న విధానం పట్ల సంతోషంగా ఉన్నాను. మ్యాచ్ మ్యాచ్‌కూ అతను తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నాడు. ఇరు జట్లలో స్పిన్నర్లు మెరుగైన ప్రదర్శన చేశారు. బౌలర్లు మరీ ఫుల్ లెంగ్త్‌లో వేస్తే తప్ప, బ్యాటర్లు భారీ సిక్సర్లు కొట్టడం ఈ వికెట్‌పై అంత సులువు కాదు. బ్యాటర్లకు అది అంత తేలికైన ఆప్షన్ కాదు. ఏది ఏమైనా మేం ఆత్మవిశ్వాసంతో సానుకూలంగా ముందుకు సాగాల్సి ఉంది.'అని రహానే అభిప్రాయపడ్డాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications