For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వేలంలో వెంకటన్నకు జాక్‌పాట్!

ఐపీఎల్ 2025 మెగా వేలంలో టీమిండియా బ్యాటింగ్ ఆల్‌రౌండర్ వెంకటేశ్వర్ అయ్యర్‌కు జాక్‌పాట్ ధర దక్కింది. విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగే వెంకటేశ్ అయ్యర్‌ను రూ. 23.75 కోట్ల భారీ ధరకు తన పాత ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2024 సీజన్‌ టైటిల్‌ కేకేఆర్ గెలవడంలో వెంకటేశ్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు.

అయితే రిటెన్షన్ రూల్స్‌లో భాగంగా అతన్ని వేలంలోకి వదిలేసిన కేకేఆర్.. రికార్డ్ ధరకు తిరిగి సొంతం చేసుకుంది. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన వెంకటేశ్ అయ్యర్ కోసం లక్నో సూపర్ జెయింట్స్, ఆర్‌సీబీ, కోల్‌కతాతో పోటీపడ్డాయి. దాంతో అతని ధర అమాంతం పెరిగింది. ఆర్‌సీబీ చివరి వరకు పోటీపడటంతో.. కేకేఆర్ రూ. 23.75 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది.

KKR Bought Venkatesh Iyer For INR 23 75 crore at IPL Auction 2025

ఐపీఎల్ 2021లో కేకేఆర్ తరఫున క్యాష్ రిచ్ లీగ్‌లోకి అరంగేట్రం చేసిన వెంకటేశ్ అయ్యర్.. ఇప్పటి వరకు 51 మ్యాచ్‌లు ఆడి 137 స్ట్రైక్‌రేట్‌తో 1326 రన్స్ చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ 2024 సీజన్‌లో వెంకటేశ్ 14 మ్యాచ్‌ల్లో 370 పరుగులు చేశాడు.

బౌలింగ్ చేయగల సామర్థ్యం కూడా ఉండటంతో ఈ యువ ఆల్‌రౌండర్ కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. దాంతో ఇప్పటి వరకు జరిగిన వేలంలో అత్యధిక ధర పలికిన మూడో ఆటగాడిగా వెంకటేశ్ అయ్యర్ నిలిచాడు. రిషభ్ పంత్(రూ. 27 కోట్లు), శ్రేయస్ అయ్యర్(26.75 కోట్లు) అధిక ధర పలికి ఆటగాళ్లలో వెంకటేశ్ అయ్యర్ కంటే ముందున్నారు.

IPL 2025 మెగా వేలం హైలైట్స్

అర్ష్‌దీప్ సింగ్-రూ. 18 కోట్లు(పంజాబ్ కింగ్స్-ఆర్‌టీఎమ్)

కగిసో రబడా-రూ. 10.75 కోట్లు(గుజరాత్ టైటాన్స్)

శ్రేయస్ అయ్యర్-రూ. 26.75 కోట్లు(పంజాబ్ కింగ్స్)

జోస్ బట్లర్-రూ.15.75 కోట్లు(గుజరాత్ టైటాన్స్)

మిచెల్ స్టార్క్-రూ.11.75 కోట్లు(ఢిల్లీ క్యాపిటల్స్)

రిషభ్ పంత్-రూ. 27 కోట్లు(లక్నో సూపర్ జెయింట్స్)

మహమ్మద్ షమీ-రూ. 10 కోట్లు(SRH)

డేవిడ్ మిల్లర్-రూ. 7.5 కోట్లు(లక్నో సూపర్ జెయంట్స్)

యుజ్వేంద్ర చాహల్-రూ. 18 కోట్లు(పంజాబ్ కింగ్స్)

లియామ్ లివింగ్ స్టోన్-రూ. 8.75 కోట్లు(ఆర్‌సీబీ)

కేఎల్ రాహుల్-రూ. 14 కోట్లు(ఢిల్లీ క్యాపిటల్స్)

హ్యారీ బ్రూక్-రూ.6.25 కోట్లు(ఢిల్లీ క్యాపిటల్స్)

దేవదత్ పడిక్కల్-అన్ సోల్డ్

ఎయిడెన్ మార్క్‌రమ్-రూ. 2 కోట్లు(లక్నో)

డేవాన్ కాన్వే- 6.25 కోట్లు (సీఎస్‌కే)

రాహుల్ త్రిపాఠి-రూ. 3.40 కోట్లు(సీఎస్‌కే)

డేవిడ్ వార్నర్-అన్‌సోల్డ్

జేక్ ఫ్రీజర్-మెక్ గుర్క్-రూ. 9 కోట్లు(ఢిల్లీ)

హర్షల్ పటేల్-రూ. 8 కోట్లు(SRH)

రచిన్ రవీంద్ర-రూ. 4 కోట్లు(సీఎస్‌కే)

ఆర్. అశ్విన్-రూ. 9.75 కోట్లు(సీఎస్‌కే)

వెంకటేశ్ అయ్యర్-రూ. 23.75 కోట్లు(కేకేఆర్)

మార్కస్ స్టోయినీస్-రూ. 11 కోట్లు(పంజాబ్ కింగ్స్)

మిచెల్ మార్ష్- రూ. 3.4 కోట్లు(లక్నో)

గ్లేన్ మ్యాక్స్‌వెల్-రూ. 4.20 కోట్లు(పంజాబ్)

Story first published: Sunday, November 24, 2024, 19:44 [IST]
Other articles published on Nov 24, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+