For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

DC vs KKR Qualifier 2: నేరాన్ని ఒప్పుకున్న దినేష్ కార్తీక్.. జరిమానా వేసిన ఐపీఎల్‌ యాజమాన్యం! నిషేధం పడేనా?

KKR batsman Dinesh Karthik fined for breaching the IPL Code of Conduct during Qualifier 2 vs DC
IPL 2021 Final CSK VS KKR మ్యాచ్ లో ట్విస్ట్.. నిషేధం ఉండొచ్చు | DK ఎంత పని చేసావ్ | Oneindia Telugu

షార్జా: రెండుసార్లు ఛాంపియన్ అయిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2021 ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జరిగిన రెండో క్వాలిఫయర్‌ మ్యాచులో కోల్‌కతా అద్భుత విజయాన్ని అందుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచులో మ‌రో బంతి మిగిలి ఉన్న స‌మ‌యంలో రాహుల్ త్రిపాఠి సిక్స్ కొట్ట‌డంతో కోల్‌క‌తా విజయాన్ని అందుకుంది. దాంతో ఢిల్లీకి మ‌రోసారి నిరాశే ఎదురైంది.

గ‌త సీజ‌న్‌లో ఫైన‌ల్ వ‌ర‌కూ వ‌చ్చినా ట్రోఫీ అందుకోలేక‌పోయిన ఆ టీమ్‌.. ఈసారి క్వాలిఫైయ‌ర్ 2లో ఇంటిబాట ప‌ట్టింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ 5 వికెట్లకు 135 పరుగులే చేయగా.. కోల్‌క‌తా 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసి అద్భుత విజయాన్ని అందుకుంది. ఇక ఫైనల్‌ మ్యాచ్ కోల్‌కతా, చెన్నై జట్ల మధ్య శుక్రవారం జరగనుంది.

స్టంప్స్‌ను బ్యాటుతో కొట్టి

స్టంప్స్‌ను బ్యాటుతో కొట్టి

అయితే ఫైనల్‌కు వెళ్లిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టుకు భారీ షాక్ తగిలింది. క్వాలిఫయర్‌ 2 మ్యాచులో ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు కేకేఆర్‌ వికెట్ కీపర్, బ్యాటర్ దినేష్ కార్తీక్‌కు జరిమానా పడింది. షార్జా వేదికగా గత రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 ఓవర్‌ వేసిన కాగిసో రబడా బౌలింగ్‌లో కార్తీక్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. అంతకుముందు నితీష్ రాణా, గిల్ ఔట్ అవ్వడంతో.. అసహనానికి లోనైన కార్తీక్ స్టంప్స్‌ను బ్యాటుతో కొట్టి పెవిలియన్ చేరాడు. ఇది ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళికి విరుద్ధం. దాంతో డీకేకు జరిమానా విధించారు.

అదే జరిగితే

అదే జరిగితే

'ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవెల్ 1 అఫెన్స్ 2.2 రూల్ ప్రకారం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ప్లేయర్ దినేష్ కార్తీక్ చేసిన పని క్రీడాస్ఫూర్తికి విరుద్ధం. కార్తీక్ తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. తుది నిర్ణయం మ్యాచ్ రిఫరీపై తీసుకుంటాడు' ఐపీఎల్ తన అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే జరిమానాను ఎదుర్కొన్న డీకే.. మ్యాచ్ రిఫరీ విధించే శిక్షకు కూడా కట్టుబడి ఉండాల్సి ఉంటుంది.

ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఆటగాళ్లకు మ్యాచ్ రిఫరీ ఒక మ్యాచ్‌ నిషేదం కూడా విధించిన సందర్భాలు గతంలో కొన్ని ఉన్నాయి. ఇప్పుడు కార్తీక్ చేసిన తప్పును ఒకవేళ రిఫరీ సీరియస్‌గా తీసుకుంటే.. అతడిపై కూడా ఓ మ్యాచ్ నిషేధం పడనుంది. అదే జరిగితే శుక్రవారం జరిగే ఫైనల్ మ్యాచ్ కార్తీక్ ఆడడు. దాంతో కోల్‌కతా భారీ షాక్ తగలనుంది.

Rahul Tripathi: 'విజయానికి ఓ భారీ షాట్ అవసరం అని తెలుసు.. కానీ సిక్స్‌ కొడతానని అసలు ఊహించలేదు'

వ్యాఖ్యాతగా కొత్త అవతారం

వ్యాఖ్యాతగా కొత్త అవతారం

దినేష్ కార్తీక్ ఇటీవల వ్యాఖ్యాతగా అవతారం ఎత్తిన విషయం తెలిసిందే. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో దిగ్గజ ఆటగాడు సునీల్‌ గవాస్కర్‌కు తోడుగా దినేశ్‌ కార్తీక్‌ వ్యాఖ్యానం చేసి అలరించాడు. ఆపై ఇంగ్లండ్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన వన్డేల్లో కూడా వ్యాఖ్యానం చేశాడు. కామెంటరీ తొలిసారి అయినా.. ఎంతో అనుభవం ఉన్న వాడిలా చేశాడు. దీంతో మాజీలు అందరూ అతడిని ప్రశంసించారు.

కేవలం భారత్‌లోనే రిటైర్మెంట్‌ అనంతరం చేసే పనిగా కామెంటరీని పరిగణిస్తారని, అలాంటి మూస ధోరణిని మార్చాలనుకుంటున్నట్లు డీకే చెప్పాడు. తాను జట్టులో లేనప్పుడు సంతోషంగా కామెంట్రీ చెబుతానన్నాడు. కార్తీక్‌ భారత్ తరఫున 26 టెస్టులు, 94 వన్డేలు, 32 టీ20లు ఆడాడు.

ప్రపంచకప్‌లో విఫలమవడంతో

ప్రపంచకప్‌లో విఫలమవడంతో

ఎంఎస్ ధోనీ కంటే ముందే ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి దినేశ్ కార్తీక్ ఎంట్రీ ఇచ్చినా.. ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా మాత్రం కొనసాగలేకపోయాడు. ధోనీ వెలుగులోకి వచ్చిన తర్వాత బ్యాటర్‌గా మాత్రమే టీమ్‌లోకి ఎంపికవుతూ వచ్చిన కార్తీక్.. ఆ తరవాత టీమిండియాకి పూర్తిగా దూరమైపోయాడు. అయితే దేశవాళీ క్రికెట్‌లో తమిళనాడు తరఫున నిలకడగా ఆడుతూ వచ్చిన కార్తీక్.. 2018 నిదహాస్ ట్రోఫీ ఫైనల్‌ తర్వాత ఒక్కసారిగా హీరో అయ్యాడు.

తర్వాత 2019 వన్డే ప్రపంచకప్‌కి కూడా భారత సెలెక్టర్లు అతడిని ఎంపిక చేశారు. ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌‌లో నెం.5 స్థానంలో బ్యాటింగ్‌కి దిగి.. 25 బంతుల్లో కేవలం 6 పరుగులే చేసి ఔటయ్యాడు. ఇక అక్కడి నుంచి కార్తీక్‌పై వేటు కొనసాగుతోంది.

Story first published: Thursday, October 14, 2021, 13:42 [IST]
Other articles published on Oct 14, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+