For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Rahul Tripathi: 'విజయానికి ఓ భారీ షాట్ అవసరం అని తెలుసు.. కానీ సిక్స్‌ కొడతానని అసలు ఊహించలేదు'

I knew it was just one hit away: KKR batsman Rahul Tripathi reacts on match winning six vs DC

షార్జా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2021 ఫైనల్లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ అడుగుపెట్టింది. బుధవారం రాత్రి షార్జా వేదికగా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జరిగిన రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగినా.. మ‌రో బంతి మిగిలి ఉన్న స‌మ‌యంలో రాహుల్ త్రిపాఠి సిక్స్ కొట్ట‌డంతో కోల్‌క‌తా ఫైన‌ల్ చేరింది. కోల్‌కతా విజయానికి చివరి 2 బంతుల్లో 6 పరుగులు అవసరమవగా.. రవిచంద్రన్ అశ్విన్ వేసిన షార్ట్ లెంగ్త్ బంతిని లాంగాఫ్‌లో సిక్స్‌గా రాహుల్ త్రిపాఠి కొట్టేశాడు. దాంతో కోల్‌కతా 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ ఓటమితో ఢిల్లీ మ‌రోసారి ఉత్తిచేతులతోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.

సిక్స్ బాదేసిన త్రిపాఠి

సిక్స్ బాదేసిన త్రిపాఠి

కోల్‌కతా విజయానికి చివరి 24 బంతుల్లో 13 పరుగులే అవసరమవగా.. చేతిలో ఏకంగా 8 వికెట్లు ఉన్నాయి. దాంతో కోల్‌కతా విజయం ఖాయం అనుకున్నారు అందరూ. కానీ ఇక్కడే ఢిల్లీ బౌలర్లు మాయ చేశారు. అవేష్ ఖాన్, కగిసో రబాడ, అన్రిచ్ నోర్జ్ అద్భుత బంతులు వేశారు. వరుసగా మూడు ఓవర్లలో 2, 1, 3 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీశారు. దాంతో కోల్‌కతా కష్టాల్లో పడింది.

చివరి ఓవర్‌‌లో కోల్‌కతా విజయ సమీకరణం 6 బంతుల్లో 7 పరుగులుగా మారింది. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్.. ఆఖరి ఓవర్‌ని స్పిన్నర్ ఆర్ అశ్విన్‌తో వేయించాడు. కోల్‌కతా తొలి నాలుగు బంతులకీ రెండు వికెట్లు కోల్పోయి ఒక పరుగే చేసింది. అయితే ఐదో బంతికి స్ట్రైక్‌కి వెళ్లిన రాహుల్ త్రిపాఠి..అద్భుత సిక్స్ బాదేసి కోల్‌కతాను గెలిపించాడు.

 అవకాశం కోసం వేచిచూసి

అవకాశం కోసం వేచిచూసి

ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లోనే క్రీజులోకి వెళ్లిన రాహుల్ త్రిపాఠి.. చివరి వరకూ మంచి అవకాశం కోసం వేచిచేశాడు. ఇంతలోగా ఢిల్లీ ఫాస్ట్ బౌలర్ల కోటా పూర్తయింది. ఇది గమనించిన త్రిపాఠి.. ఆ ఒక్క ఓవర్‌ని స్పిన్నర్‌తో వేయిస్తుందని అంచనా వేశాడు. త్రిపాఠి అనుకున్నదే జరిగింది. దాంతో సమయం కోసం వేచిచూసి.. ఆఖరి ఓవర్‌లో పని పూర్తి చేశాడు.

మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన త్రిపాఠి.. తనపై తనకు జట్టును గెలిపించగలనన్న నమ్మకం ఉందని తెలిపాడు. కోల్‌కతా విజయానికి ఓ భారీ షాట్ అవసరం అని తెలుసు కానీ ఐదవ బంతికే సిక్స్ బాదుతానని అసలు ఊహించలేదని త్రిపాఠి చెప్పాడు.

T20 World Cup 2021: బుర్జ్​ ఖలీఫాపై మెరిసిన టీమిండియా కొత్త జెర్సీ.. కోహ్లీ, రోహిత్, జడేజాలు అలా!!

ఒక పెద్ద హిట్‌ కావాలని భావించా

ఒక పెద్ద హిట్‌ కావాలని భావించా

'విజయం సాధించడం చాలా గొప్పగా అనిపిస్తుంది. జట్టు గెలుపు చాలా ముఖ్యం. మాకు ఒకటి లేదా రెండు కఠినమైన ఓవర్లు పడ్డాయి. సునాయాసంగా గెలుస్తాం అనుకున్నా కానీ.. చివరి ఓవర్ వరకు మ్యాచ్ వెళ్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. మ్యాచ్‌ గెలిచినందుకు సంతోషంగా ఉంది. 18వ ఓవర్ రబాడా బాగా బౌలింగ్‌ చేశాడు. స్పిన్నర్‌లో ఒకరని టార్గెట్‌ చేయాలని అనుకున్నాను.

ఢిల్లీ టీమ్ ఒక ఓవర్‌ని ఆఫ్ స్పిన్నర్‌తో వేయించబోతోందని నాకు అర్థమైంది. దాంతో ఆ ఓవర్‌ కోసం వెయిట్ చేశా. కొత్త బ్యాట్స్‌మెన్‌లకు సింగిల్స్ మరియు బౌండరీలు బాదడం చాలా కష్టం. అందుకే నేనే బాధ్యత తీసుకున్నా. కానీ రెండు బంతులే మిగిలి ఉండడంతో గెలుపు సాధ్యం కాదని అనిపించింది. ఆ సమయంలో ఒక పెద్ద హిట్‌ కావాలని భావించా. అయితే సిక్స్‌తో ముగిస్తానని మాత్రం అసలు ఊహించలేదు' రాహుల్ త్రిపాఠి అన్నాడు.

గొప్పగా పుంజుకున్నాం

గొప్పగా పుంజుకున్నాం

మొదటి దశ తర్వాత తాము యూఏఈలో గొప్పగా పుంజుకున్నామని రాహుల్ త్రిపాఠి పేర్కొన్నాడు. ఇది తమ జట్టుకు గొప్ప ప్రయాణమన్నాడు. తమని తాము విశ్వసించామని, కెప్టెన్ మరియు కోచ్ ఇచ్చిన మద్దతు ఎంతో సహాయపడిందని త్రిపాఠి చెప్పుకొచ్చాడు. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ 5 వికెట్లకు 135 పరుగులే చేయగా.. కోల్‌క‌తా 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసి అద్భుత విజయాన్ని అందుకుంది. వెంకటేశ్‌ అయ్యర్‌కు 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' దక్కింది. ఇక ఫైనల్‌ మ్యాచ్ శుక్రవారం జరుగుతుంది. చెన్నైతో కోల్‌కతా అమితుమీ తేల్చుకోనుంది.

Story first published: Thursday, October 14, 2021, 12:37 [IST]
Other articles published on Oct 14, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+