For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Sex in Cricket: కొందరు మ్యాచ్ ముందు చేసుకుంటారు: కేకేఆర్ కోచ్

క్రికెటర్ల లైంగిక జీవితంపై కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) అసిస్టెంట్ కోచ్, టీమిండియా మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్‌లో సెక్స్‌పై ఎలాంటి నిషేధం లేదని, ఆటగాళ్ల వ్యక్తిగత ఇష్టాలపై ఆధారపడి ఉంటుందని తెలిపాడు. కొందరు మ్యాచ్‌కు ముందు చేసుకుంటే.. మరికొందరు మ్యాచ్ తర్వాత సెక్స్ చేస్తారని, ఇంకొందరు మ్యాచ్‌ల సమయంలో అస్సలు చేయరని చెప్పాడు.

ఐపీఎల్ 2024 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజేతగా నిలవడంలో అభిషేక్ నాయర్ కీలక పాత్ర పోషించాడు. అసిస్టెంట్ కోచ్‌గా దేశీయ ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేసేలా వారికి గైడెన్స్ ఇచ్చాడు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అభిషేక్ నాయర్‌ను హోస్ట్ 'క్రికెట్‌లో సెక్స్'అనే అంశంపై ప్రశ్నించాడు.

KKR assistant coach Abhishek Nayar says Sex before or after match Depends on person to person

ఈ ప్రశ్నతో కాస్త ఆశ్చర్యానికి లోనైన అభిషేక్ శర్మ అనంతరం నిజాయితీగా సమాధానం చెప్పాడు. 'మీరు సానుకూల దృక్పథంతో అడుగుతున్నారా? లేక ప్రతికూల వైఖరితో ప్రశ్నిస్తున్నారా? మీరు చాలా ఓపెన్-ఎండ్ ప్రశ్న అడిగారు. సెక్స్ లేకుండా ఏ మానవుడు మనుగడ సాగిస్తాడు? క్రికెట్‌లో సెక్స్ మంచిదా? చెడ్డదా? అనేదేనా మీ ప్రశ్న? అసలు మీ ప్రశ్న ఉద్దేశం ఏంటి?

సెక్స్ చేయడం అనేది ప్రతీ ఒక్కరికి మాములు విషయమే. అయితే ఆటగాళ్ల మనస్థత్వంపై అది ఆధారపడి ఉంటుంది. సెక్స్ విషయంలో ఆటగాళ్లు విభిన్నంగా ఆలోచిస్తారు. కొంతమంది మ్యాచ్ ముందు చేసుకుంటే మరికొందరు తర్వాత చేసుకుంటారు. మరికొందరు అస్సలు చేసుకోరు. మ్యాచ్‌లు పూర్తయ్యే వరకు దూరంగా ఉంటారు.

సెక్స్ చేయకపోతే వారి శక్తి పెరగడంతో పాటు ఆటపై ఫోకస్ పెరుగుతుందని నమ్ముతారు. మరికొందరు మాత్రం సెక్స్ చేస్తే రిలీఫ్ లభిస్తుందని భావిస్తారు. ఇది ఆటగాళ్ల వ్యక్తిగత విషయం. సెక్స్ చేయాలని, చేయవద్దని క్రికెటర్లకు ఎలాంటి నియమం లేదు. వాస్తవం ఏంటంటే.. జీవితంలోని వివిధ దశల్లో వివిధ విషయాలు పనిచేస్తాయి. కొన్ని సార్లు ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడికి గురవుతారు. వాళ్లు చిల్ అవ్వడానికి సెక్స్ ఉపయోగపడుతుంది.'అని అభిషేక్ నాయర్ చెప్పుకొచ్చాడు.

గత ఐదేళ్ల నుంచే బీసీసీఐ టీమిండియా ఆటగాళ్ల సతీమణులు, గర్ల్ ఫ్రెండ్స్‌ను టీమ్ హోటల్లో కలిసి ఉండేందుకు అనుమతిస్తోంది. అంతకుముందు క్రికెటర్ల భార్యలు, కుటుంబ సభ్యులు, సహాయక సిబ్బందిని రెండు వారాలు మాత్రమే టీమ్ హోటల్లో ఉండేందుకు అనుమతించేవారు.

Story first published: Saturday, June 8, 2024, 16:08 [IST]
Other articles published on Jun 8, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+