KKR: 'ఎందుకో తెలియదు.. ఆండ్రూ రసెల్‌కు బౌలింగ్ చేయడం ఇష్టం లేదు'

దుబాయ్: కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రూ రసెల్‌కు బౌలింగ్ చేయడం ఇష్టం లేదని ఆ జట్టు మరో ఆల్‌రౌండర్ సిద్దేశ్ లాడ్ అన్నాడు. రసెల్‌కు బౌలింగ్ వేయడం కంటే.. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడతా అంటూ అతడు తెలిపాడు. వెస్టిండీస్ ఆటగాడు భారీ హిట్టర్ రసెల్ ఎంతటి భీకరమైన ఆటగాడో అందరికీ తెలిసిందే. గతేడాది కేకేఆర్ తరఫున పలు కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

ప్రాక్టీస్ సమయంలో
కేకేఆర్ జట్టులోనే సిద్ధేశ్ లాడ్, ఆండ్రూ రసెల్ ఉన్నారు. ఇద్దరు ఓకే జట్టులో ఉండడంతో 2020 ఐపీఎల్‌లో రసెల్‌కు బౌలింగ్ వేసే అవకాశం సిద్దేశ్‌కు రాదు. కానీ మ్యాచ్‌లకు ముందు కేకేఆర్ ప్రాక్టీస్ సమయంలో తమ రిజర్వ్ బౌలర్లతోనే నెట్స్‌లో బంతులు వేయించుకొని ప్రాక్టీస్ చేస్తుంటారు. ఒకవేళ రసెల్‌కు బౌలింగే చేయాల్సి వస్తే.. తాను అతనికి బౌలింగ్ వేయడానికి ఇష్టపడన్నాడు. అంతేకాదు ఇతర పరిష్కార మార్గాలు కూడా వెతుక్కుంటానంటూ సిద్ధేశ్ తెలిపాడు.

రసెల్‌ను చూస్తే బౌలింగ్ వేయాలనిపించదు
'ఎందుకో తెలియదు. నాకు ఆండ్రూ రసెల్‌ను చూస్తే బౌలింగ్ వేయాలనిపించదు. అతను బంతులను బలంగా బాదుతూ తన విధ్వంసకర ఆటను కొనసాగిస్తాడు. నేను ముంబై ఇండియన్స్ జట్టుతో ఉన్నప్పుడు అతని ఆటను గమనించాను. ఎన్నోసార్లు అతడి విధ్వంసాన్ని దగ్గరుండి చూశాను. ఇప్పటివరకు నేను రసెల్‌కు బౌలింగ్ చేయలేదు. ఇప్పుడు ఒకే జట్టులో ఉన్నాం కాబట్టి నెట్స్‌లోనూ అతనికి బౌలింగ్ చేయాలనుకోవడం లేదు' అని సిద్ధేశ్ లాడ్ తెలిపాడు. బుమ్రాను ఇదివరకే నెట్స్‌లో, దేశవాళి క్రికెట్‌లో ఎదుర్కొన్నానని, దాంతో అతడి బౌలింగ్‌పై కాస్త అవగాహన ఉందన్నాడు.

విధ్వంసకర ఇన్నింగ్స్‌లు
గతేడాది 2019 ఐపీఎల్‌లో కోల్‌కతా తరపున రసెల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడాడు. పరాజయం అంచున నిలిచిన ప్రతీసారి తన విధ్వంసకర ఆటతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆ సీజన్‌లో 204.81 సగటుతో 510 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్థ సెంచరీలు ఉన్నాయి. ఐదు లేదా ఆరు స్థానాల్లో వచ్చే రసెల్‌ను ఈసారి బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందు పంపాలని జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయించిందని ఆ జట్టు ప్రధాన కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్, మెంటార్ డేవిడ్ హస్సీలు తెలిపారు. బ్యాటింగ్ ఆర్డర్‌లో రసెల్‌ను ముందు పంపితే టీ20 డబుల్ సెంచరీ చేసే సత్తా రసెల్‌కు ఉందంటూ డేవిడ్ హస్సీ అభిప్రాయపడ్డాడు.

23న తొలి మ్యాచ్:
టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలో 2012, 2014లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు రెండుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. గంభీర్ తర్వాత కోల్‌కతా కెప్టెన్‌గా ఎంపికయిన దినేష్ కార్తిక్ సారధ్యంలో 2018లో ఫ్లే ఆఫ్స్, 2019లో లీగ్ స్టేజీలోనే వెనుదిరిగింది. ఇక ఐపీఎల్ 2020 ఈ నెల 19న ప్రారంభం కానుంది. 23న ముంబై ఇండియన్స్ జట్టుతో కోల్‌కతా తొలి మ్యాచ్ ఆడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
పాకిస్తాన్ క్రికెటర్లకు బంపరాఫర్.. భారీగా పెరిగిన వేతనాలు!!