Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాకిస్తాన్ క్రికెటర్లకు బంపరాఫర్.. భారీగా పెరిగిన వేతనాలు!!

Pakistan Cricket Board announces huge pay hike for domestic cricketers

కరాచీ: పాకిస్థాన్ దేశవాళీ క్రికెటర్లకు బంపరాఫర్ దక్కింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) దేశవాళీ క్రికెటర్ల వేతనాలను భారీగా పెంచింది. ఈ విషయాన్ని పీసీబీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో దేశవాళీ క్రికెట్‌లో ఓ అగ్రశ్రేణి ఆటగాడికి ఇప్పుడు ఈ సీజన్‌లో 3.2 మిలియన్ పాకిస్తాన్ రూపాయలు సంపాదించే అవకాశం లభించింది. ఇది భారత కరెన్సీలో దాదాపు రూ. 14 లక్షలు. ఇందులో నెలవారీ వేతనాలైన 1.50 లక్షల పాక్ రూపాయలు కూడా ఉన్నాయి.

సెప్టెంబర్ 30న ప్రారంభమయ్యే 2020-21 సీజన్‌కు ముందు పీసీబీ కొత్త వేతనాలను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా వేతన విధానంతో దేశవాళీ ఆటగాళ్లకు గతేడాదితో పోలిస్తే.. ఏడు శాతానికి పైగా అధిక వేతనం లభిస్తుంది. ఒకప్పుడు తక్కువ పారితోషికం అందుకున్న అగ్రశ్రేణి దేశవాళీ ఆటగాడికి ఇప్పుడు 3.2 మిలియన్ల పాక్ రూపాయలు సంపాదించే అవకాశం లభించింది. 2019-20తో పోలిస్తే ఇది 83శాతం అధికం కావడం గమనార్హం.

ఓ దేశవాళీ ఆటగాడికి తక్కువలో తక్కువగా 1.8 మిలియన్లు లభిస్తుంది. అయినప్పటికీ గతేడాది అత్యుత్తమ విభాగంలో ఉన్న ఆటగాళ్లకు లభించిన దానికంటే ఇది ఏడు శాతం ఎక్కువని పీసీబీ పేర్కొంది. కేటగిరి ఎ+, కేటగిరి ఎ, కేటగిరి బీ, కేటగిరి సీ, కేటగిరి డీల ప్రకారం పీసీబీ పాక్ దేశవాళీ ఆటగాళ్లకు వేతనాలు ఇవ్వనుంది. కేటగిరి ఎ+ లోని 10 మంది ఆటగాళ్లకు నెలకు రూ. 1.50 లక్షలు (భారత కరెన్సీలో రూ.66 వేలు) అందనున్నాయి.

పెరిగిన వేతనాలు ఇలా ఉన్నాయి:

కేటగిరి ఎ+ - 10 మంది ఆటగాళ్లకు నెలకు రూ. 1.50 లక్షలు (భారత కరెన్సీలో రూ.66 వేలు)

కేటగిరి ఎ - 38 ఆటగాళ్లకు నెలకు రూ. 85 వేలు (భారత కరెన్సీలో రూ. 37 వేలు)

కేటగిరి బీ- 48 మంది ఆటగాళ్లకు నెలకు రూ. 75 వేలలు (భారత కరెన్సీలో రూ. 33 వేలు)

కేటగిరి సీ- 72 మంది ఆటగాళ్లకు నెలకు రూ. 65 వేలు (భారత కరెన్సీలో రూ. 28 వేలు)

* కేటగిరి డీ-24 మంది ఆటగాళ్లకు నెలకు రూ. 40 వేలు (భారత కరెన్సీలో రూ. 17.500)

Story first published: Tuesday, September 8, 2020, 17:43 [IST]
Other articles published on Sep 8, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+