
పద్దతి అయితే ఇది...
సహజంగా ఎప్పుడైనా ఒక జట్టును ఎంపిక చేసినప్పుడు, లేదా కెప్టెన్‌ను మార్చినప్పుడు సెలెక్టర్లు నిర్ణయం తీసుకొని దాన్ని అధ్యక్షుడికి చూపించిన తర్వాతే అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుందన్నాడు. తాను సెలెక్టర్‌గా పనిచేసిన రోజుల్లో ఇలాగే చేశామని తెలిపాడు.అయితే, ఇక్కడ కోహ్లీని వన్డే సారథిగా తొలగించడం కన్నా.. అతనికి ఆ విషయాన్ని తెలియజేసిన విధానమే మరింత బాధపెట్టి ఉండొచ్చని చెప్పాడు. చివరగా ఈ నిర్ణయం తీసుకున్న సెలెక్టర్లంతా చాలా గొప్ప వాళ్లని ప్రశంసిస్తూనే.. వాళ్లంతా కోహ్లీ ఆడిన ఆటలో సగం మ్యాచ్‌లు కూడా ఆడలేదని విమర్శించాడు.

సగం కూడా ఆడలేదు..
'కెప్టెన్ మార్చినప్పుడు ఆ నిర్ణయాన్ని సెలెక్టర్లు ముందు బోర్డు ప్రెసిడెంట్ దృష్టికి తీసుకెళ్లాలి. అతను ఆమోదం పొందిన తర్వాత ప్రకటన చేయాలి. నేను సెలెక్టర్‌గా ఉన్నప్పుడు టీమ్ సెలెక్ట్ చేసినా ఇలానే చేసేవాళ్లం. అలా చేసుంటే గంగూలీ కోహ్లీతో మాట్లాడేవాడు. అప్పుడు విరాట్ కూడా ఇంతలా బాధపడేవాడు కాదు. నాకు తెలిసి సెటెక్టర్లు వారి నిర్ణయాన్ని చివర్లో చెప్పడమే కోహ్లీ ఎక్కువగా బాధించినట్లుంది. అయితే ఈ సెలెక్టర్లంతా గొప్పవాళ్లే. కానీ వీరంతా కలిసి ఆడిన మ్యాచ్‌లు కోహ్లీ ఆడినదాంట్లో సగం కూడా ఉండవు'అని సెటైర్లు పేల్చాడు.

చివరి నిమిషంలో..
సౌతాఫ్రికా ఫ్లైట్ ఎక్కేముందు బుధవారం మీడియాతో మాట్లాడిన విరాట్ కోహ్లీ.. బోర్డుపై షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. టీ20 కెప్టెన్సీ వదులుకోవద్దని తనను ఎవరు అడగలేదని, వన్డే కెప్టెన్సీ వేటు గురించి టెస్ట్ టీమ్ సెలెక్షన్ అప్పుడే చెప్పారని ప్రకటించాడు. టీ20 కెప్టెన్సీ వదులుకోవద్దని విరాట్‌ను రిక్వెస్ట్ చేశామంటూ అంతకుముందు బోర్డు ప్రెసిడెంట్ సౌరవ్ చేసిన వ్యాఖ్యలకు ఇవి పూర్తి వ్యతిరేకంగా ఉండటంతో బీసీసీఐ పెద్దలపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.అంతేకాకుండా బోర్డు, విరాట్ మధ్య అసలేం జరుగుతోందనే చర్చ కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో తన హోమ్ టౌన్ కోల్‌కతాలో గురువారం మీడియా ఎదుటపడిన దాదా.. ఈ వ్యవహారంపై స్పందించేందుకు నిరాకరించాడు.

గంగూలీ ఎమన్నాడంటే?
'ఎలాంటి ప్రకటన చేసేది లేదు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లు లేవు. మేమే ఈ సమస్యను పరిష్కరించుకుంటాం. విషయాన్ని బీసీసీఐకి వదిలేయండి' అంటూ వెళ్లిపోయాడు. దాంతో, విరాట్, బీసీసీఐ మధ్య మొదలైన వార్ ఎలా ముగుస్తుందోనని క్రికెట్ ఫ్యాన్స్ టెన్షన్‌లో ఉన్నారు. కోహ్లీ విషయంలో బీసీసీఐ కొంత సమయం వేచి చూడాలనుకుంటుంది. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ నేపథ్యంలో ఇప్పుడే ఏదైనా కఠిన నిర్ణయం తీసుకుంటే అది టీమ్, ప్లేయర్ల కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీస్తుందని, దానివల్ల సమస్య మరింత పెద్దది అవుతుందని భావిస్తోంది. అందుకే కోహ్లీ వ్యాఖ్యలపై స్పందించడానికి గంగూలీ నిరాకరించాడట. కోహ్లీ గురించి ఎలాంటి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టొద్దని, మీడియాకు ఎలాంటి ప్రకటన ఇవ్వొద్దని అంతా మూకుమ్మడిగా నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications












