Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బీసీసీఐ.. మీ అధ్యక్షుడే దొంగ! చర్యలు తీసుకుంటారా?: మాజీ క్రికెటర్

భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)‌పై మాజీ క్రికెటర్, 1983 ప్రపంచకప్ విన్నర్ కీర్తి ఆజాద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్‌పై ఏజ్ ఫ్రాడ్ ఆరోపణలు వస్తున్నాయని, అతనిపై చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నించాడు.

జూనియర్ లెవెల్ క్రికెట్ సెలెక్షన్‌‌లో ఎంపికయ్యేందుకు మిథున్ మన్హాస్ ఏజ్ ఫ్రాడ్‌కు పాల్పడినట్లు జమ్మూ కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ మాజీ జాయింట్ సెక్రటరీ సుదర్శన్ మెహతా ఆరోపించారు. మాజీ డీఎస్పీ అయిన సుదర్శన్ మెహతా.. మిథున్ మన్హాస్‌పై చర్యలు తీసుకోవాలని కోర్టును కూడా ఆశ్రయించారు. సబ్-జూనియర్, జూనియర్ విభాగాల్లోని నేషనల్ టోర్నీల ఎంపికకు అర్హత సాధించేందుకు మన్హాస్ రెండు వేర్వేరు పట్టిన తేదీలను సమర్పించారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

బీసీసీఐ చర్యలు తీసుకుంటుందా..?

ఈ వ్యవహారంపై ప్రాథమిక విచారణ జరిపి సెప్టెంబర్ 3లోపు నివేదిక సమర్పించాలని జమ్మూలోని స్థానిక కోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ న్యూస్ క్లిప్‌ను ఎక్స్‌ వేదికగా షేర్ చేసిన కీర్తి ఆజాద్.. బీసీసీఐ ఏం చేస్తుందని విమర్శలు గుప్పించాడు.

Kirti Azad Questions Mithun Manhas Age Fraud Case Asks If BCCI Will Take Action

'భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఏం చేస్తోంది? ఏజ్ ఫ్రాడ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అధ్యక్షుడిగా ఎన్నుకుంది. మిథున్ మన్హాస్‌కు రెండు వేర్వేరు జన్మదిన తేదీలు ఉన్నాయి . ఒకటి బీసీసీఐలో నమోదైతే.. మరొకటి డీడీసీఏలో నమోదైంది. బీసీసీఐ తన సొంత అధ్యక్షుడిపై చర్యలు తీసుకుంటుందా?'అని అని కీర్తి ఆజాద్ ప్రశ్నించారు. కీర్తి ఆజాద్ పోస్ట్‌తో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది.

రెండేళ్లుగా తక్కువగా పేర్కొంటూ..

మాజీ దేశవాళీ క్రికెటర్ అయిన మిథున్ మన్హాస్‌ జమ్మూకశ్మీర్‌కు చెందినవాడు. జమ్మూకశ్వీర్ తరఫున కెరీర్ ప్రారంభించిన అతను ఆ తర్వాత న్యూఢిల్లీకి ప్రాతినిధ్యం వహించాడు. దేశవాళీ క్రికెట్‌లో రాణించినా.. టీమిండియా తరఫున ఆడే అవకాశం అతనికి రాలేదు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్‌లో పలు హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించాడు. ఏజ్ క్రికెట్ కోసం తన బర్త్ డే డేట్‌ను 9/12/1977 పేర్కొన్న మిథున్ మన్హాస్.. ఢిల్లీ‌కి ఆడే సమయంలో 12/10/1979గా పేర్కొన్నాడని ఆరోపణలు వస్తున్నాయి. క్రికెట్‌లో ఏజ్ ఫ్రాడ్‌ను తీవ్ర నేరంగా పరిగణిస్తారు. ఈ ఆరోపణలపై మిథున్ మన్హాస్ కానీ, బీసీసీఐ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు.

Story first published: Thursday, August 20, 2026, 18:43 [IST]
Other articles published on Aug 20, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+