విరాట్ కోహ్లీ కెప్టెన్సీని భర్తీ చేసేది అతనే: మాజీ సెలెక్టర్

న్యూఢిల్లీ: టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌పై భారత మాజీ చీఫ్ సెలెక్టర్ కిరణ్ మోరే ప్రశంసల జల్లు కురిపించాడు. టీమిండియా భవిష్యత్తు కెప్టెన్ పంతేనని అభిప్రాయడ్డాడు. జట్టును నడిపించగల నైపుణ్యాలు, సరైన మనస్థత్వం అతని సొంతమని తెలిపాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు సారథ్యం వహించిన అనుభవం అతనికి పనికొస్తుందని పేర్కొన్నాడు. తాజాగా ఇండియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోనీ వారసత్వాన్ని కోహ్లీ అందిపుచ్చుకుంటే.. అతని స్థానాన్ని పంత్ భర్తీ చేయనున్నాడని తెలిపాడు.

ఫ్యూచర్ కెప్టెన్..
'రిషభ్ పంత్.. భవిష్యత్‌లో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కెప్టెన్‌కు ఉండాల్సిన అన్ని లక్షణాలు పంత్‌కు ఉన్నాయి. అతని కెరీర్‌ను ఓసారి పరిశీలిస్తే ప్రారంభంలో చాలా ఒడిదొడుకులు కనిపిస్తాయి. మొదట్లో అతను ఎదుర్కొన్న గడ్డు పరిస్థితుల వల్లే అతను మానసికంగా దృఢంగా తయారయ్యాడు. తొలుత ప్రపంచకప్‌కు ఎంపిక కాలేదు. టీ20లతో పాటు వన్డేలకూ జట్టులోకి తీసుకోలేదు. కానీ, అతను అనూహ్యంగా టెస్టు ఫార్మాట్ ద్వారా జట్టులోకి వచ్చాడు. స్థాయికి తగ్గ ప్రదర్శనతో జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడు.'అని కిరణ్ మోరే చెప్పుకొచ్చాడు.

ఆసీస్ గడ్డపై అదరగొట్టి..
పాకిస్థాన్ వెటరన్ బ్యాట్స్‌మన్ సల్మాన్ బట్ సైతం టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ పంతేనని తెలిపాడు. ఇటీవల ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో పంత్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టెస్టుల్లో 274 పరుగులు చేసిన ఈ వికెట్ కీపర్.. జట్టుకు కీలకమైన సమయాల్లో రాణించాడు.
అదే విధంగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లోనూ 270 పరుగులు చేసి జట్టుకు తానెంత ముఖ్యమైన ఆటగాడనేది నిరూపించాడు. శ్రేయస్ అయ్యర్ గైర్హాజరీలో ఢిల్లీ క్యాపిటల్స్ సారథ్య బాధ్యతలు అందుకున్న పంత్.. జట్టును అద్భుతంగా నడిపించి పాయిట్స్ టేబుల్‌ల్లో మెరుగైన స్థానంలో నిలబెట్టాడు.

రోహిత్ శర్మ కూడా..
టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు కెప్టెన్‌గా నియమించాలని వస్తోన్న వాదనలకు కిరణ్ మోరె మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీనే ఏదో ఒక రోజు తన సారథ్య బాధ్యతలను రోహిత్‌తో పంచుకోవడానికి ముందుకు వస్తాడని కూడా ఈ మాజీ చీఫ్ సెలెక్టర్ జోస్యం చెప్పాడు.
' రోహిత్ శర్మకు త్వరలోనే భారత జట్టుకు సారథ్యం వహించే అవకాశం వస్తుందనుకుంటున్నా. ధోనీ ఆధ్వర్యంలో కోహ్లీ తెలివిగల సారథిగా వృద్ధి చెందాడు. ఎంతకాలం వన్డేలు, టీ20లకు కెప్టెన్‌గా ఉండాలని అనుకుంటాడు? అతడు కూడా ఈ విషయమై ఆలోచిస్తాడు. ఇంగ్లండ్ పర్యటన తర్వాత దీనిపై స్పష్టత వస్తుంది. కోహ్లీ.. కెప్టెన్సీ బాధ్యతల్ని రోహిత్‌తో పంచుకుంటే భవిష్యత్ తరాలకు ఓ బలమైన సందేశాన్ని ఇచ్చినట్లవుతుంది. భారత్‌లో ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కెప్టెన్ అనే పంథా సెట్ అవుతుంది.'అని కిరణ్ మోరె తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications