For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2026: కొంపముంచిన రొమారియో షెపర్డ్.. గెలిచే మ్యాచ్‌లో ఓడిన ఆర్‌సీబీ!

ఐపీఎల్ 2026 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. డేవిడ్ మిల్లర్(10 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 22 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌కు చిరస్మరణీయమైన విజయాన్నందించాడు. ట్రిస్టన్ స్టబ్స్ అద్బుత పోరాటం కనబర్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 175 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్(38 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 63) హాఫ్ సెంచరీతో రాణించగా.. టీమ్ డేవిడ్(17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 26) పర్వాలేదనిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో లుంగి ఎంగిడి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీయగా.. ముఖేష్ కుమార్ ఒక వికెట్ పడగొట్టాడు.

Killer Miller Strikes David Miller Heroics Overpower Romario Shepherd in DC s Thrilling Win Over RCB

అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 19.5 ఓవర్లలో 4 వికెట్లకు 179 పరుగులు చేసి ఓటమిపాలైంది. కేఎల్ రాహుల్(34 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57), ట్రిస్టన్ స్టబ్స్(47 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 60 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించగా.. అక్షర్ పటేల్(18 బంతుల్లో 3 ఫోర్లతో 25 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్‌సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్(3/26) మూడు వికెట్లు తీయగా.. కృనాల్ పాండ్యా ఒక వికెట్ పడగొట్టాడు.

కొంపముంచిన రొమారియో..

చివరి 18 బంతుల్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి 37 పరుగుల అవసరమయ్యాయి. భువనేశ్వర్ కుమార్ వేసిన 18వ ఓవర్‌లో ట్రిస్టన్ స్టబ్స్ భారీ సిక్సర్‌తో మ్యాచ్ మూమెంటమ్‌ను మార్చాడు. రసిక్ సలామ్ వేసిన 19వ ఓవర్‌లో 6 పరుగులే రావడంతో ఆఖరి ఓవర్‌లో ఆర్‌సీబీ విజయానికి 15 పరుగులు అవసరమయ్యాయి.

ఈ ఓవర్ వేసిన రొమారియో షెఫర్డ్ తొలి రెండు బంతులకు రెండు సింగిల్స్ మాత్రమే ఇవ్వడంతో ఆర్‌సీబీ విజయం లాంఛనమేనని అంతా అనుకున్నారు. కానీ మిల్లర్ కిల్లర్‌లా వరుసగా రెండు సిక్స్‌లు, బౌండరీ బాది చిరస్మరణీయమైన విజయాన్నందించాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో తన వల్లే ఎదురైన పరాజయానికి లెక్కసరిచేశాడు. రొమారియో షెఫర్డ్ కాస్త కట్టడిగా బౌలింగ్ చేసినా.. భువనేశ్వర్ కుమార్ తన ఆఖరి ఓవర్‌లో సిక్స్ ఇవ్వకపోయినా.. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ విజయం సాధించేది.

Story first published: Saturday, April 18, 2026, 19:44 [IST]
Other articles published on Apr 18, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+