For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Pollard vs Bravo: ఏమిరా.. నీ విమానం నేల కూలింది? అన్నా.. నీకాళ్లు మొక్కుతా వదిలేయే!(వీడియో)

డల్లాస్: వెస్టిండీస్ దిగ్గజ ఆటగాళ్లు కీరన్ పోలార్డ్, డ్వేన్ బ్రావో ఎంత క్లోజ్ ఫ్రెండ్సో క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆన్‌ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్‌లో వీరు చేసే పనులే.. వారి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని తెలియజేస్తాయి. వీరి చర్యలతో అభిమానులను కూడా నవ్విస్తుంటారు. ఐపీఎల్ 2023 సీజన్ తర్వాత ఈ ఇద్దరి మధ్య ఫన్నీ వార్ నడుస్తోంది.

తన జట్టే గొప్పదంటే తనదేనని ఈ ఇద్దరూ సవాళ్లకు దిగుతున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ గెలుచుకోవడంతో బ్రావో.. పోలార్డ్ ముందు ఓవరాక్షన్ చేశాడు. ఐపీఎల్ 2022 సీజన్ వరకు ఆటగాళ్లుగా కొనసాగిన ఈ ఇద్దరూ లెజెండ్స్.. ఐపీఎల్ 2023 సీజన్‌లో మాత్రం కోచ్‌లుగా అవతారమెత్తారు.

kieronpollardteasedwaynebravo

ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్‌గా కీరన్ పొలార్డ్ కొనసాగుతుండగా.. చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్‌గా డ్వేన్ బ్రావో సేవలందించారు. ఐపీఎల్ 2023 సీజన్ టైటిల్ గెలవడంతో బ్రావో.. పోలార్డ్ ముందు అతి చేశాడు. ఐపీఎల్‌లో సక్సెస్‌ఫుల్ టీమ్ తమదేనని, ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచామని తెలిపాడు.

అంతేగాకుండా కోచ్‌గా తొలి టైటిల్ అందుకున్నానని పోలార్డ్‌ను టీజ్ చేశాడు. అప్పట్లో ఈ వీడియో నెట్టింట తెగవైరల్ అయ్యింది. సరిగ్గా రెండు నెలల తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. అగ్రరాజ్యం అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ క్రికెట్ లీగ్ టోర్నీలో ప్రత్యర్థులుగా ఈ ఇద్దరు బరిలోకి దిగారు.

ముంబై ఇండియన్స్‌కు చెందిన ఎంఐ న్యూయార్క్ టీమ్‌ తరఫున పోలార్డ్ ఆడితే.. సీఎస్‌కేకు చెందిన టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్టుకు డ్వేన్ బ్రావో ప్రాతినిథ్యం వహించాడు. శనివారం జరిగిన ఎలిమినేటర్-2 మ్యాచ్‌లో ఎంఐ న్యూయార్క్ 6 వికెట్ల తేడాతో టెక్సాస్ సూపర్ కింగ్స్‌ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

ఈ విజయంతో పోలార్డ్ రెచ్చి పోయాడు. బ్రావోను తనదైన శైలిలో టీజ్ చేశాడు. బ్రావో ట్రేడ్‌మార్క్ ఏరోప్లేన్ సెలెబ్రేషన్‌ను ఇమిటేట్ చేస్తూ ఆటపట్టించాడు. 'ఏమిరా నీ విమానం నేల కూలిందా?'అని ఎటకారం చేశాడు. ఓటమితో చిన్నబోయిన డ్వేన్ బ్రావో.. 'అన్నా జర చంపకే.. నీ కాళ్లు మొక్కుతా.. నువ్వే తోపు'అంటూ వేడుకున్నాడు.

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. అభిమానులు ఫీదా అవుతున్నారు. వీరి మధ్య స్నేహం చూడ ముచ్చటగా ఉందని కొనియాడుతున్నారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టెక్సాస్ సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 158 పరుగులకు కుప్పకూలింది.

డేవాన్ కాన్వే(38), మిలింద్ కుమార్(37) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఎంఐ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్(4/24) టీఎస్‌కే పతనాన్ని శాసించాడు. టీమ్ డేవిడ్ రెండు, ఇషాన్ అదిల్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఎంఐ న్యూయార్క్ 19 ఓవర్లలోనే 4 వికెట్లకు 162 పరుగులు చేసి గెలుపొందింది. డేవాల్డ్ బ్రేవిస్(41 నాటౌట్), టీమ్ డేవిడ్(33) రాణించారు.

Story first published: Saturday, July 29, 2023, 15:49 [IST]
Other articles published on Jul 29, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+