వారెవ్వా పొలార్డ్ వాటే బౌలింగ్.. చూస్తే వావ్ అనాల్సిందే (వీడియో)

నార్త్‌సౌండ్: వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ అద్భుత క్యాచ్‌తో సహా మరో ప్రత్యేక వికెట్‌తో ఔరా అనిపించాడు. శ్రీలంకతో బుధవారం జరిగిన తొలి వన్డేలో తనదైన బౌలింగ్‌తో చెలరేగాడు. ఇటీవలే శ్రీలంకపైనే 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టి ఫుల్ జోష్ ఉన్న ఈ విండీస్ వీరుడు.. వన్డేల్లోనూ అదే జోరు కనబర్చాడు. అయితే, టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంకకు మంచి శుభారంభం దక్కింది. ఓపెనర్లు గుణతిలక( 61 బంతుల్లో 7 ఫోర్లు 55), కరుణరత్నె( 61 బంతుల్లో 4 ఫోర్లతో 52) తొలి వికెట్‌కు 105 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న వీరినీ పొలార్డ్ స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేర్చాడు.
స్టన్నింగ్ క్యాచ్..
తొలుత అతను వేసిన 19.2 ఓవర్‌కు కరుణరత్నె స్ట్రైట్ షాట్ ఆడగా బంతి బౌలర్ కుడివైపు నుంచి వెళ్లింది. దాంతో వెంటనే స్పందించిన పొలార్డ్ తన కుడిచేతిని చాచి క్యాచ్ పట్టడానికి ప్రయత్నించాడు. అయితే బంతి చేతికి తగిలి గాల్లోకి లేవడంతో అలాగే కష్టపడి ముందుకెళ్లి ఒంటి చేత్తో బంతిని ఒడిసిపట్టాడు. దాంతో లంక తొలి వికెట్ కోల్పోయింది. సింగిల్ హ్యాండెడ్‌తో అతను పట్టిన క్యాచ్‌కు కరుణ రత్నెతో పాటు మైదానంలో ఆటగాళ్లు, కామెంటేటర్లు అవాక్కయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.

‘అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్'..
ఇక పొలార్డ్ వేసిన 21.1 ఓవర్‌కు గుణతిలక డిఫెన్స్ ఆడగా, బంతి అతడి కాళ్ల వద్దే ఆగిపోయింది. అది గమనించకుండా ముందుకు వెళ్లిన అతను.. పొలార్డ్ రనౌట్ చేయడానికి వస్తున్నట్లు గమనించి మరో ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ నిస్పంకను పరుగు కోసం రావొద్దని చెప్పాడు. అదే సమయంలో అతను కూడా క్రీజులోకి వెనక్కి పరుగెడుతూ అనుకోకుండా బంతిని కాలితో తన్నాడు. అప్పటికే పొలార్డ్ రనౌట్ చేయడానికి బంతి దగ్గరికి రావడంతో గుణతికల కావాలనే బంతిని తన్నాడని, అది క్రికెట్ నిబంధనలకు విరుద్ధమని అప్పీల్ చేశాడు. విషయం థర్డ్ అంపైర్‌కు చేరడంతో అతడు రీప్లే చూసి ఔటిచ్చాడు.
రూల్స్ ప్రకారం..
ఇక క్రికెట్ నిబంధనల ప్రకారం ఎవరైనా బ్యాట్స్‌మెన్ ఉద్దేశపూర్వకంగా తమ మాటలతో లేదా, చేష్టలతో ఫీల్డింగ్ చేస్తున్న జట్టుకు అడ్డంకులు సృష్టిస్తే ఆ బ్యాట్స్‌మెన్‌ను అబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్‌గా పరిగణిస్తూ ఔటిస్తారు. ఈ నేపథ్యంలోనే ఔటిచ్చారు. అయితే, గుణతిలక అనుకోకుండా బంతిని తన్నాడని, ఉద్దేశపూర్వకంగా కాదని నెటిజెన్లు మండిపడుతున్నారు. అతన్ని ఔటివ్వాల్సింది కాదని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది.

విండీస్ విజయం..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టుకు ఓపెనర్లు ఎవిన్ లూయిస్(90 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 65), షై హోప్(133 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌తో 110) శుభారంభం చేయగా, చివర్లో బ్రావో( 47 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 37) రాణించడంతో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 47 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో 8 వికెట్ల తేడాతో కరీబియన్ జట్టు ఘన విజయం సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications