IPL 2020: రోహిత్, ధోనీ, కోహ్లీలకు షాక్.. కెప్టెన్‌గా పొలార్డ్!!

దుబాయ్: యూఏఈ వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ ఇప్పటికే సగం పూర్తయింది. ఈ నేపథ్యంలో అన్ని జట్లు ప్లే ఆఫ్స్ చేరాలని చూస్తున్నాయి. అందుకోసం ఆటగాళ్లు కూడా కష్టపడుతున్నారు. ఐపీఎల్ 13వ సీజన్లో మంచి ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను ఎంచుకుని వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఇయాన్ బిషప్ తన ఫేవరేట్ ఐపీఎల్ జట్టును ఎంచుకున్నాడు. తన జట్టులో ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీలకు బిషప్ స్థానం కల్పించలేదు.

కెప్టెన్‌గా పొలార్డ్:
వెస్టిండీస్‌కు చెందిన మాజీ బౌలర్ ఇయాన్ బిషప్ ప్రస్తుతం ఐపీఎల్ 2020లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే తన ఫాంటసీ ఐపీఎల్ జట్టును ఎంపిక చేశాడు. ఇటీవలి కాలంలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ కీరోన్ పొలార్డ్‌ను బిషప్ తన ఐపీఎల్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక చేశాడు. ఐపీఎల్‌కు ముందు జరిగిన కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో పొలార్డ్ సత్తాచాటి అక్కడ ఫామ్‌నే ఇక్కడ కొనసాగిస్తున్నాడు. సీపీఎల్ 2020లో తన జట్టును పొలార్డ్ విజేతగా నిలిపాడు.

ఓపెనర్లుగా రాహుల్, డుప్లెసిస్:
ఇయాన్ బిషప్ తన ఐపీఎల్ జట్టులో ఏడుగురు భారత క్రికెటర్లను తీసుకున్నాడు. కేఎల్ రాహుల్, ఫాఫ్ డుప్లెసిస్‌లను ఓపెనర్లుగా తీసుకున్నాడు. పంజాబ్ ఓపెనర్‌గా రాహుల్.. చెన్నై ఓపెనర్‌గా ఫాఫ్ అద్భుతంగా రాణిస్తున్నారు. అంతేకాదు ఇద్దరు టోర్నీ టాపర్లుగా ఉన్నారు. ఫస్ట్ డౌన్ ఆటగాడిగా సూర్యకుమార్ యాదవ్‌ను బిషప్ ఎంచుకున్నాడు. సూర్యకుమార్ ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలు పూర్తి చేశాడు.

స్పెషలిస్టు స్పిన్నర్‌గా యూజీ:
సెకండ్ డౌన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు ఇయాన్ బిషప్ తన ఐపీఎల్ జట్టులో స్థానం కల్పించాడు. శ్రేయస్ ఢిల్లీ జట్టుకు పరుగులు చేయడమే కాక.. జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్‌లను ఆల్‌రౌండర్ల కోటాలో తీసుకున్నాడు. పాండ్యా బ్యాటింగ్ విభాగంలో రెచ్చిపోతుండగా.. రషీద్ తన బౌలింగ్ మాయతో చెలరేగుతున్నాడు. ఫాస్ట్ బౌలర్లుగా మహ్మద్ షమీ, కగిసో రబడ, జస్ప్రీత్ బుమ్రాలను తీసుకున్నాడు. స్పెషలిస్టు స్పిన్నర్‌గా యజ్వేంద్ర చహల్‌ను ఎంపిక చేశాడు. ఈ ఐపీఎల్ ఫామ్ ఆధారంగా జట్టును ఎంపిక చేశాడు బిషప్.
RCB vs KXIP: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ.. క్రిస్ గేల్ ఆగయా!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications