Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CPL 2020: పోలార్డ్ సింగిల్ హ్యాండ్ సిక్స్.. పోలా అదిరిపోలా..!(వీడియో)

Kieron Pollard lights up CPL 2020 with stunning one-hand sixes against Barbados Tridents

ట్రినిడాడ్: కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) 2020 సీజన్‌లో వెస్టిండీస్ సీనియర్ క్రికెటర్ కీరన్ పోలార్డ్ అదరగొడుతున్నాడు. అతను సారథ్యం వహిస్తున్న ట్రిన్‌బాగ్ నైట్ రైడర్స్ జట్టు కూడా వరుస విజయాలతో దూసుకెళ్తుంది. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలందుకున్న ఆ జట్టు టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది. ఇక ఆదివారం బార్బోడస్ ట్రిడెంట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పొలార్డ్ రెచ్చిపోయాడు. 17 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లతో 41 పరుగులతో అజేయంగా నిలిచాడు.

వచ్చిరావడంతోనే బౌలర్లపై విరుచుకుపడ్డ పొలార్డ్.. ధనాధన్ ఇన్నింగ్స్‌తో నైట్ రైడర్స్ భారీ స్కోర్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో అతను కొట్టిన ఓ సిక్స్ ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఒంటి చేత్తో కొట్టిన ఆ భారీ సిక్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ వేసిన 16.6 బంతిని పోలార్డ్ ఒంటి చేత్తో లాంగాఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు. అయితే ఒంటి చేత్తో కొట్టినా.. బంతి మైదానం ఫెన్సింగ్ అవతల పడటం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. పోలార్డ్ సూపర్ షాట్‌కు అభిమానులు ముగ్ధులవుతున్నారు. సూపర్ పోలార్డ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో పోలార్డ్‌కు తోడుగా డారెన్ బ్రేవో(36 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 54 నాటౌట్), కొలిన్ మున్రో (30 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 50) వీరవిహారం చేయడంతో నైట్‌రైడర్స్ 19 పరుగులతో గెలుపొందింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన నైట్ రైడర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 185 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బార్బోడస్ ట్రిడెంట్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. హాఫ్ సెంచరీతో రాణించిన కొలిన్ మున్రోకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

Story first published: Tuesday, August 25, 2020, 15:19 [IST]
Other articles published on Aug 25, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+