For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌కు గుడ్‌ బై చెప్పిన ముంబై ఇండియన్స్ స్టార్ ఆల్‌రౌండర్! బ్యాటింగ్ కోచ్‌గా సెకండ్ ఇన్నింగ్స్!

Kieron Pollard has announced his retirement from the IPL; named MI batting coach

న్యూఢిల్లీ: ముంబై ఇండియన్స్ స్టార్ ఆల్‌రౌండర్, వెస్టిండీస్ విధ్వంసకర ప్లేయర్ కీరన్ పొలార్డ్ ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో పొలార్డ్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే వచ్చే సీజన్ కోసం అతన్ని వేలంలోకి వదిలేయాలని ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. కానీ పొలార్డ్.. మేనేజ్‌మెంట్‌కు ఆ అవకాశం ఇవ్వకుండా తానే స్వయంగా తప్పుకున్నాడు.

ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఓ సుదీర్ఘమైన పోస్ట్ ద్వారా వెల్లడించాడు. మరికొన్ని రోజులు ఆడాలని ఉన్నా.. ముంబై ఇండియన్స్‌తో ఆడే పరిస్థితి లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు. ఇక ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్‌గా జట్టుకు సేవలందిస్తానని పేర్కొన్నాడు.

'ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్‌తో మాట్లాడిన తర్వాతే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాను. ముంబై తప్పా మరో జట్టు తరఫున నేను ఆడాలనుకోవడం లేదు. ముంబై జట్టులో మార్పులు అవసరం. నేను ఇప్పుడు ముంబైకి ఆడలేకపోతున్నాను. కానీ ఎప్పటికీ ముంబైకి అండగానే ఉంటాను. ఇది భాగోద్వేగపూరితమైన నిర్ణయం కాదు. ఐపీఎల్‌లో ముంబై బ్యాటింగ్ కోచ్‌ ఆఫర్‌ను స్వీకరించాను. అలాగే ముంబై ఎమిరేట్స్ తరఫున ఆటగాడిగా కొనసాగుతాను. నా భవిష్యత్తు పట్ల నేను ఉత్సాహంగా ఉన్నాను.

ఐపీఎల్‌లోనే అత్యంత సక్సెస్ గల ముంబైకి 13 సీజన్లుగా ఆడటాన్ని నేను గర్వంగా ఫీలవుతున్నా. నాకు సహకరించిన కోచ్‌లు, సహచర ఆటగాళ్లకు ధన్యవాదాలు. ముఖ్యంగా జట్టు యాజమానులు అయిన ముఖేష్, నీతా, ఆకాశ్ అంబానీలకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు.'అని పొలార్డ్ పేర్కొన్నాడు.

పొలార్డ్ తన కెరీర్ మొత్తాన్ని ముంబైతో ఆడాడు. ఐపీఎల్‌లో 171 ఇన్నింగ్స్‌లలో 3412 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో పొలార్డ్ బ్యాటింగ్ సగటు 28.67 కాగా, అతని కెరీర్ స్ట్రైక్ రేట్ 147.32గా నిలిచింది. 16 అర్ధ సెంచరీలు చేసిన పొలార్డ్ లీగ్‌లో అత్యుత్తమ ఫినిషర్‌లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. దశాబ్దానికి పైగా ముంబై ప్లేయింగ్ XIలో అత్యంత నిలకడగా ఉన్న పొలార్డ్ గత సీజన్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. అతను గత సీజన్‌లో 11 మ్యాచ్‌ల్లో 14.40 సగటుతో 144 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సమయంలో అతని స్ట్రైక్-రేట్ కూడా 107.46 మాత్రమే. గతంలో జట్టు తరఫున ఆడిన లసిత్ మలింగాను బౌలింగ్ కోచ్‌గా తీసుకున్న ముంబై.. ఇప్పుడు పొలార్డ్‌ను బ్యాటింగ్ కోచ్‌గా ఎంచుకుంది.

Story first published: Tuesday, November 15, 2022, 15:22 [IST]
Other articles published on Nov 15, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+