వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ కీరన్ పోలార్డ్ మరోసారి తన విశ్వరూపం చూపించాడు. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న 'ది హండ్రెడ్ లీగ్'లో వరుసగా 5 బంతుల్లో 5 సిక్స్‌లు బాదాడు. అతని ధాటికి అఫ్గానిస్థాన్ స్పిన్ సెన్సేషన్ రషీద్ ఖాన్ బలయ్యాడు.
ఈ లీగ్‌లో సౌథెర్న్ బ్రేవ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న కీరన్ పోలార్డ్.. ట్రెంట్ రాకెట్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 23 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 45 పరుగులు చేసి సౌథెర్న్ బ్రేవ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఈ మ్యాచ్‌లో ట్రెంట్ రాకెట్స్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను పోలార్డ్ చీల్చిచెండాడాడు. పోలార్డ్ ధాటికి రషీద్ ఖాన్ చెత్త గణంకాలు నమోదు చేశాడు. 20 బంతులేసి 40 పరుగులు సమర్పించుకున్నాడు. ఇందులో 5 బంతుల్లో పోలార్డ్ వరుసగా 5 సిక్స్‌లు బాదాడు. ప్రస్తుతం పోలార్డ్ విధ్వంసానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ట్రెంట్ రాకెట్స్ నిర్ణీత 10 బంతుల్లో 8 వికెట్లకు 126 పరుగులు చేసింది. క్రిస్ జోర్గాన్(3/22), జోఫ్రా ఆర్చర్(2/18) కట్టడిగా బౌలింగ్ చేశారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌథెర్న్ బ్రేవ్ 99 బంతుల్లో 8 వికెట్లకు 127 పరుగులు చేసి గెలుపొందింది. పోలార్డ్‌తో పాటు జేమ్స్ విన్స్(28), అలెక్స్ డేవిస్(28) రాణించారు. అంతర్జాతీయ టీ20ల్లో పోలార్డ్ 6 బంతుల్లో 6 సిక్స్‌ల రికార్డ్ కూడా అందుకున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన పోలార్డ్.. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఫ్రాంచైజీ లీగ్స్ మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో మాత్రం ముంబై ఇండియన్స్‌కు సహాయక కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.