చరిత్ర సృష్టించిన కీరన్ పొలార్డ్.. బట్లర్ రికార్డ్ బద్దలు!
వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ కీరన్ పోలార్డ్ విశ్వరూపం చూపించాడు. 39 ఏళ్ల వయసులోనూ విధ్వంసకర బ్యాటింగ్‌తో వీరవిహారం చేశాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) 2026 సీజన్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న కీరన్ పోలార్డ్.. సెయింట్ లూసియా కింగ్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగాడు.
ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కీరన్ పొలార్డ్ 26 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 65 పరుగులు చేశాడు. 250 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. తద్వారా టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ క్రమంలో జోస్ బట్లర్‌ను 14,890 వెనక్కి నెట్టాడు. 14,921 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
ఇటీవలే ది హండ్రెడ్ లీగ్‌లో బట్లర్.. పొలార్డ్, గేల్(14,562)ను వెనక్కినెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. 15వేల పరుగుల మైలురాయి అందుకునేందుకు పొలార్డ్ ఇంకా 79 పరుగుల దూరంలో ఉన్నాడు. సీపీఎల్‌లో ఈ ఫీట్ సాధించే అవకాశం ఉంది.

అయితే కీలక సమయంలో పొలార్డ్ ఔటవ్వడంతో ఈ మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌కు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన సెయింట్ లూసియా కింగ్స్ 36 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సెయింట్ లూసియా కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 211 పరుగులు చేసింది. టీమ్ సీఫెర్ట్(61 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 105 నాటౌట్) అజేయ శతకంతో రాణించగా.. చరిత్ అసలంక(21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 33) పర్వాలేదనిపించాడు. నైట్‌రైడర్స్ బౌలర్లలో సునీల్ నరైన్, ఉస్మాన్ తారిక్, కీరన్ పొలార్డ్ తలో వికెట్ తీసారు.
అనంతరం ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 175 పరుగులే చేసి ఓటమిపాలైంది. కీరన్ పొలార్డ్‌తో పాటు కొలిన్ మున్రో(35 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సెయింట్ లూసియా కింగ్స్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్(3/24) మూడు వికెట్లు తీయగా.. మాథ్యూ ఫోర్డే, జోషువా బిషప్, కీన్ గాస్టోన్ తలో వికెట్ తీసారు.
ఇతర బ్యాటర్ల నుంచి సరైన సహకారం లేకపోవడంతో కీరన్ పొలార్డ్ మ్యాచ్‌ను ముగించలేకపోయాడు. కానీ క్రీజులో ఉన్నంత సేపు పరుగుల విధ్వంసం సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కీరన్ పొలార్డ్.. కేవలం ఫ్రాంచైజీ లీగ్స్ మాత్రమే ఆడుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

