టీ20ల్లో 1000 సిక్సర్లు.. చరిత్ర సృష్టించిన కీరన్ పొలార్డ్!
వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం కీరన్ పొలార్డ్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో 1000 సిక్సర్లను పూర్తి చేసుకున్నాడు. తద్వారా ప్రపంచంలోనే ఈ ఘనతను అందుకున్న రెండో బ్యాటర్‌గా నిలిచాడు.
అగ్రరాజ్యం అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో ముంబై న్యూయార్క్‌కు సారథ్యం వహిస్తున్న పొలార్డ్.. వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో జరిగిన ఎలిమినేటర్-1 మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన పొలార్డ్.. 25 బంతుల్లోనే 250కి పైగా స్ట్రైక్‌రేట్‌తో 64 పరుగులు చేశాడు. ఇందులో 8 భారీ సిక్సర్లు ఉన్నాయి.
ఈ మ్యాచ్‌కు ముందు 1000 సిక్సర్ల మైలురాయికి 7 సిక్సర్ల దూరంలో ఉన్న పొలార్డ్.. ఈ మ్యాచ్‌లో 8 బాది ఈ అరుదైన ఫీట్ సాధించాడు. 39 ఏళ్ల ఏళ్ల వయసులో పొలార్డ్ ఈ ఫీట్ సాధించాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డ్ వెస్టిండీస్‌కే చెందిన యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉంది.

అతను 463 మ్యాచ్‌ల్లో 1056 సిక్సర్లు కొట్టాడు. 745 మ్యాచ్‌లు ఆడిన పొలార్డ్.. గేల్ రికార్డ్‌ను అధిగమించడానికి ఇంకా 56 సిక్సర్లు కావాలి. ఈ జాబితాలో వెస్టిండీస్‌కే చెందిన ఆండ్రీ రస్సెల్ 792 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్ కీరన్ పొలార్డ్ రాణించినా ముంబై న్యూయార్క్‌కు ఓటమి తప్పలేదు. ఆండ్రీస్ గౌస్ అద్భుత శతకంతో వాషింగ్టన్ ఫ్రీడమ్ 6 వికెట్ల తేడాతో ముంబై న్యూయార్క్‌ను ఓడించింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఎంఐ న్యూయార్క్ నిర్ణీత 20 ఓవర్లలో 267 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. నికోలస్ పూరన్(33 బంతుల్లో 5 ఫోర్లు, 13 సిక్స్‌లతో 106) సెంచరీతో చెలరేగగా.. కీరన్ పోలార్డ్(25 బంతుల్లో ఫోర్, 8 సిక్స్‌లతో 64) హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం వాషింగ్టన్ ఫ్రీడమ్ 18.4 ఓవర్లలో 270 పరుగులు చేసి రికార్డ్ విజయాన్ని అందుకుంది. కెప్టెన్ స్టీవ్ స్మిత్(110*), ఆండ్రిస్ గోస్(132) శతకాలతో చెలరేగాడు. టీ20 క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద ఛేజింగ్ రికార్డ్‌ను సొంతం చేసుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

