Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రికెట్ ఇప్పుడు వ్యాపారమైంది.. సారీ యూనివర్స్ బాస్: కీరన్ పోలార్డ్

వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్‌కు ఆ జట్టు మాజీ ఆల్‌రౌండర్ కీరన్ పోలార్డ్ క్షమాపణలు చెప్పాడు. క్రిస్ గేల్‌కు చెందిన 12 ఏళ్ల అరుదైన రికార్డ్‌ను కీరన్ పోలార్డ్ తాజాగా బద్దలు కొట్టాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ వరల్డ్ రికార్డ్‌తో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌కు కీరన్ పోలార్డ్ క్షమాపణలు తెలియజేశాడు.

IND vs SL: 'బేబీ బాస్’ వీరవిహారం.. లంక ముందు భారీ టార్గెట్!

IND vs SL: 'బేబీ బాస్’ వీరవిహారం.. లంక ముందు భారీ టార్గెట్!

అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ 2026 సిరీస్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎంఐ న్యూయార్క్ తరఫున ఆడిన పొలార్డ్ 56 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో 81 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద.. క్రిస్ గేల్ ఆల్‌టైమ్ రికార్డ్‌ను అధిగమించాడు. 39 ఏళ్ల పొలార్డ్ ఇప్పటి వరకు 736 టీ20 మ్యాచ్‌లు ఆడి..14582 పరుగులు చేశాడు. 14,562 పరగులతో గేల్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

Kieron Pollard Apologizes to Chris Gayle After Becoming the All-Time Highest Run-Scorer in T20 Cricket

సారీ.. యూనివర్స్ బాస్

ఈ చారిత్రాత్మక రికార్డ్ అనంతరం మాట్లాడిన పోలార్డ్.. ఆసక్తిర వ్యాఖ్యలు చేశాడు. 'మేం ఎల్లప్పుడూ ఆదర్శంగా భావించే క్రిస్ గేల్ రికార్డ్‌ను బద్దలు కొట్టడం చాలా ప్రత్యేకమైనది. యూనివర్స్ బాస్.. నన్ను క్షమించండి. మనమిద్దం ఇప్పుడు అగ్రస్థానంలో ఉన్నాం. ఆరు లేదా ఏడో స్థానంలో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. చాలా మంది అప్‌ది ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయాలనుకుంటారు. ఎవరో ఒకరు లోయర్ ఆర్డర్‌లో వచ్చి మ్యాచ్‌ను ముగించే కష్టమైన పనిని చేయాల్సి ఉంటుంది.

IND vs AFG: యశస్వి శతకం.. టీమిండియా ఘన విజయం

IND vs AFG: యశస్వి శతకం.. టీమిండియా ఘన విజయం

క్రికెట్ వ్యాపారమైంది..

నేను ఆ బాధ్యతనను సవాల్‌‌గా స్వీకరించాను. టెక్నాలజీలానే క్రికెట్ కూడా మారుతోంది. క్రికెట్ ఇప్పుడు కేవలం ఒక ఆట మాత్రమే కాదు. అదొక వ్యాపారం. మమ్మల్ని విమర్శించిన వారందరూ ఇప్పుడు మౌనంగా మా విజయాలను ఆస్వాదిస్తారని ఆశిస్తున్నా'అని కీరన్ పోలార్డ్ చెప్పుకొచ్చాడు. పొలార్డ్, గేల్, బ్రావో వంటి ఆటగాళ్లు అంతర్జాతీయ మ్యాచ్‌ల కంటే ఫ్రాంచైజీ లీగ్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారని పలువురు మాజీ క్రికెటర్లు వారిపై అప్పట్లో విమర్శలు గుప్పించారు.

Story first published: Monday, June 22, 2026, 17:25 [IST]
Other articles published on Jun 22, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+