Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చిన్నప్పుడు స్నేహితులతో కలిసి క్రికెట్‌ ఆడా: కిదాంబి శ్రీకాంత్‌

Kidambi srikanth talk about his favorite Orange Army

హైదరాబాద్: ప్రతి భారతీయుడి డీఎన్‌ఏలో క్రికెట్‌ ఉంటుందని వరల్డ్ నంబర్‌వన్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ అన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఇచ్చిన ఇంటర్యూలో కిదాంబి శ్రీకాంత్ మాట్లాడుతూ 'చిన్నప్పుడు స్నేహితులతో కలిసి క్రికెట్‌ ఆడాను. ఇప్పుడు అకాడమీలో విరామ సమయంలో క్రికెట్‌ ఆడుతుంటాం' అని అన్నాడు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

'ప్రతి భారతీయుడి డీఎన్‌ఏలో క్రికెట్‌ ఉంటుంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో నాకు శిఖర్‌ ధావన్‌, భువనేశ్వర్‌ అంటే నాకు ఇష్టం. వీరిద్దరే మన జట్టులో కీలకమైన ఆటగాళ్లు' అని శ్రీకాంత్‌ అన్నాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ జట్టుకు టాలీవుడ్‌‌కు చెందిన పలురువు హీరోలతో పాటు క్రీడాకారులు కూడా మద్దతిస్తోన్న సంగతి తెలిసిందే.

తాజాగా కిదాంబి శ్రీకాంత్‌ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మద్దతుగా మాట్లాడిన వీడియోను ఆ జట్టు యాజమాన్యం ట్విటర్లో పోస్టు చేసింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లాడిన సన్‌రైజర్స్‌ మొదటి మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఆ తర్వాత ఆడిన రెండింట్లోనూ పరాజయం పాలైంది.

దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండాల్సిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ప్రస్తుతం నాలుగులో కొనసాగుతోంది. టోర్నీలో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్ మంగళవారం తన తదుపరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది.

Story first published: Monday, April 23, 2018, 19:51 [IST]
Other articles published on Apr 23, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+