టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని, ఫ్రెండ్లీగానే మెసేజ్‌లు చేసేవాడని బాలీవుడ్ నటి ఖుషీ ముఖర్జీ స్పష్టం చేసింది. ఓ ఇంటర్వ్యూలో సూర్య తనకు తరుచూ మెసేజ్‌లు చేసేవాడని ఆమె చెప్పిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ వ్యాఖ్యలను తప్పుడుగా అర్థం చేసుకున్న కొందరు నెటిజన్లు.. సూర్య మామూలోడు కాదంటూ కామెంట్ చేశారు.
మరికొందరు మాత్రం పబ్లిసిటీ స్టంట్ అంటూ ఖుషీ ముఖర్జిపై విమర్శలు గుప్పించారు. దాంతో తన వ్యాఖ్యలపై ఖుషి ముఖర్జి వివరణ ఇచ్చుకుంది. 'మా మధ్య ఏమీ లేదు. మేం జస్ట్ స్నేహితులం మాత్రమే. ఆ సమయంలో తాను ఒక మ్యాచ్‌లో ఓటమి పాలయ్యాడు. అతని ఓటమి నన్ను ఎంతో బాధించింది. అప్పుడే మెసేజ్‌లు చేసుకున్నాం. అంతకుమించి మా మధ్య ఏం లేదు. అతను నాకు మంచి స్నేహితుడు మాత్రమే.'అని ఖుషి ముఖర్జి స్పష్టం చేసింది.

ఓ ఇంటర్వ్యూలో ఏ క్రికెటర్‌తోనైనా డేటింగ్ చేయాలనుకుంటున్నారా? అని ఒక మీడియా ఈవెంట్‌లో ఖుషీ ముఖర్జీకి ప్రశ్న ఎదురైంది. 'చాలా మంది క్రికెటర్లు నా వెంటపడ్డారు. అందులో సూర్యకుమార్ యాదవ్ కూడా ఒకరు. నేను ఏ క్రికెటర్‌తో డేటింగ్ చేయాలని అనుకోవడం లేదు. అయితే సూర్యకుమార్ యాదవ్ గతంలో నాకు తరచూ మెసేజ్‌లు చేసేవాడు. ఇప్పుడు మేం కాంటాక్ట్‌లో లేము. నన్ను ఎవరితోనూ లింక్ చేసి మాట్లాడటం నాకు నచ్చదు.'అని ఖుషీ ముఖర్జి మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి.
ఎవరీ ఖుషీ ముఖర్జీ?
కోల్‌కతాకు చెందిన ఖుషీ ముఖర్జీ దక్షిణాది సినిమాలతో పాటు హిందీ బుల్లితెరపై కూడా సుపరిచితురాలే. 2013లో 'అంజల్ తురై' అనే తమిళ చిత్రంతో కెరీర్ ప్రారంభించారు. తెలుగులో 'దొంగ ప్రేమ', 'హార్ట్ ఎటాక్' వంటి చిత్రాల్లో నటించారు. ఎం టీవీ 'స్ప్లిట్స్‌విల్లా 10', 'లవ్ స్కూల్ 3' వంటి షోల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.'బాల్వీర్ రిటర్న్స్'లో జ్వాలా పరిగా, 'కహత్ హనుమాన్ జై శ్రీరామ్' వంటి పౌరాణిక సీరియల్స్‌లోనూ నటించారు. ఖుషీ ముఖర్జీ తరచుగా తన బోల్డ్ ఫ్యాషన్, వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. అయితే ఈ వ్యాఖ్యలపై సూర్యకుమార్ యాదవ్ వైపు నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు.