Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లండ్ ఓపెనర్లూ.. ద్రవిడ్ సలహాలు పాటించండి: కెవిన్ పీటర్సన్

Kevin Pietersen Tweets Rahul Dravid’s email to help England openers counter spinners
Pietersen shares Rahul Dravid’s Email to Help England openers Counter Spinners | Oneindia Telugu

లండన్: శ్రీలంక పర్యటనలో స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్న ఇంగ్లండ్‌ ఓపెనర్లకు ఆ జట్టు మాజీ కెప్టెన్ కెవిన్‌ పీటర్సన్‌ విలువైన సలహా ఇచ్చాడు. తాను క్రికెట్‌ ఆడే రోజుల్లో ఇలాగే ఇబ్బంది పడితే టీమిండియా దిగ్గజ క్రికెటర్ రాహుల్‌ ద్రవిడ్‌ కీలక సలహాలిచ్చాడని గుర్తు చేసుకున్నాడు. ద్రవిడ్‌ చేసిన ఆ సాయంతో తన ఆట పూర్తిగా మారిపోయిందని చెప్పాడు.

ప్రస్తుతం శ్రీలంకలో ఉన్న ఇంగ్లండ్‌ జట్టు రెండు టెస్టుల సిరీస్‌ ఆడుతోంది. ఇప్పటికే ఫస్ట్ టెస్టు గెలవగా, రెండో టెస్ట్‌లోనూ పట్టు బిగించింది. అయితే, ఆ జట్టు ఓపెనర్లు జాక్‌ క్రాలీ, డొమినిక్‌ సిబ్లీ తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో, రెండో టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో మొత్తం మూడుసార్లు లంక స్పిన్నర్‌ ఎంబుల్డేనియా చేతిలోనే ఔటయ్యారు. దాంతో వారు స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నారని గ్రహించిన పీటర్సన్‌.. స్పిన్‌ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలో తెలియజేస్తూ రెండు ట్వీట్లు చేశాడు. అందులో ఒకసారి రాహుల్‌ ద్రవిడ్‌ తనకు పంపిన ఈమెయిల్‌ను చదవాలని సూచించాడు. అంతేకాకుండా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఆ మెయిల్‌ను ప్రింట్ తీసి ఓపెనర్లకు అందజేయాలని ట్వీట్ చేశాడు.

అవసరమైతే ఈ విషయంపై మరింత లోతుగా చర్చించేందుకు తనకు ఫోన్‌ చేయొచ్చని కూడా పేర్కొన్నాడు. ద్రవిడ్ ఇచ్చిన సలహాతో తన సమస్య తీరిందన్నాడు.
ఇక, 2010లో బంగ్లాదేశ్‌తో ఆడిన టెస్టు సిరీస్‌లో పీటర్సన్‌ స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు. అదే సమయంలో ఐపీఎల్‌లో బెంగళూరు జట్టుకు ఆడిన అతను.. ద్రవిడ్‌తో మంచి అనుబంధం ఏర్పర్చుకున్నాడు. ఈ క్రమంలోనే టీమిండియా వాల్ స్పిన్‌ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలనే విషయంపై రెండు పేజీల సుదీర్ఘ లేఖను పీటర్సన్‌కు ఈ-మెయిల్‌ చేశాడు. దాన్నే ఇప్పుడు ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు తమ ఆటగాళ్లతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది.

Story first published: Sunday, January 24, 2021, 17:01 [IST]
Other articles published on Jan 24, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+