Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బుమ్రా చెత్త కెప్టెన్సీనే టీమిండియా వైఫల్యానికి కారణం: కెవిన్ పీటర్సన్

Kevin Pietersen slams Jasprit Bumrahs captaincy on Day 4 in India vs England 5th Test

బర్మింగ్‌హామ్: టీమిండియా తాత్కలిక సారథి జస్‌ప్రీత్ బుమ్రాపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, ప్రముఖ కామెంటేటర్ కెవిన్ పీటర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రీషెడ్యూల్ ఐదో టెస్ట్‌లో టీమిండియా వైఫల్యానికి బుమ్రా అనాలోచిత నిర్ణయాలే కారణమని పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో మూడు రోజుల పాటు బ్యాట్, బాల్‌తో సత్తా చాటి విజయం దిశగా సాగిన టీమిండియా.. నాలుగో రోజు మాత్రం తేలిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలమై ఓటమి ముంగిట నిల్చుంది. ఈ క్రమంలోనే నాలుగో రోజు ఆటలో బుమ్రా అనుసరించిన వ్యూహాలపై అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్కై స్పోర్ట్స్‌తో పీటర్సన్ మాట్లాడాడు.

కెప్టెన్‌గా బుమ్రా విఫలమయ్యాడని, సరైన ఫీల్డ్ సెటప్ చేయలేక మూల్యం చెల్లించుకున్నాడని చెప్పాడు.బుమ్రా వ్యూహాల్లో తప్పిదం కూడా ఇంగ్లండ్ పాలిట వరంగా మారిందని కెవిన్‌ పీటర్సన్‌ అభిప్రాయపడ్డాడు. డిఫెన్సివ్‌గా ఫీల్డింగ్‌ పెట్టడం వల్ల ఇంగ్లండ్ బ్యాటర్లకు షాట్లు కొట్టేందుకు స్వేచ్ఛ లభించిందని పేర్కొన్నాడు. ''బుమ్రా వ్యూహాలు సరైనవి కాదని నా అభిప్రాయం. అంతేకాకుండా రివర్స్‌ స్వింగ్‌ బంతులు బ్యాటర్లను పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. ఇక చివరి అర గంటలోనూ ఫీల్డింగ్‌కు సంబంధించి సరైన వ్యూహం లేదు'' అని పీటర్సన్ వివరించాడు.

భారత్ విధించిన 378 పరుగుల భారీ లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 259 పరుగులు చేసింది. ఓపెనర్లు అలెక్స్ లీస్(65 బంతుల్లో 8 ఫోర్లతో 56), జాక్ క్రాలీ(76 బంతుల్లో 7 ఫోర్లు 46) 107 పరుగుల భాగస్వామ్యాన్ని అందించగా.. జానీ బెయిర్ స్టో(72 బ్యాటింగ్), జోరూట్(76 బ్యాటింగ్) అజేయ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దాంతో భారత బౌలర్లు తేలిపోయారు. బుమ్రా(2/52) మినహా మరెవరూ ఒక్క వికెట్ తీయలేకపోయారు. వికెట్ సైతం పూర్తిగా ఫ్లాట్‌గా మారడం ఇంగ్లండ్ బ్యాటర్లకు కలిసొచ్చింది. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 119 పరుగులు అవసరమవ్వగా.. భారత్‌కు ఏడు వికెట్లు కావాలి. ఆట చివరి రోజు మంగళవారం ఫస్ట్ సెషన్ ఆట‌లో మ్యాచ్ ఫలితం తేలనుంది.‌

సంక్షిప్త స్కోర్లు..

భారత్ తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్(రిషభ్ పంత్ 146, రవీంద్రజడేజా 104, జేమ్స్ అండర్సన్ 5/60)

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284 ఆలౌట్(జానీ బెయిర్ స్టో 106, సామ్ బిల్లింగ్స్ 36, మహమ్మద్ సిరాజ్ 4/66)

భారత్ రెండో ఇన్నింగ్స్ 245 ఆలౌట్( పుజారా 66, రిషభ్ పంత్ 57, బెన్ స్టోక్స్ 4/33)

ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ : 57 ఓవర్లలో 259/3 (బెయిర్ స్టో 72 బ్యాటింగ్, జోరూట్ 76 బ్యాటింగ్)

Story first published: Tuesday, July 5, 2022, 15:38 [IST]
Other articles published on Jul 5, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+