
అబుదాబి: కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్సీ బాధ్యతలను యువ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్‌కు అప్పగించాలని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ కెవిన్ పీటర్సన్ సూచించాడు. కెప్టెన్‌కు ఉండాల్సిన లక్షణాలన్నీ ఈ యువ ఓపెనర్‌లో ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ అజేయ హాఫ్ సెంచరీతో రాణించడంతో ఆ జట్టు 7 వికెట్లతో గెలుపొందిన విషయం తెలిసిందే.
143 పరుగులు లక్ష్యచేధనలో శుభ్‌మన్ గిల్ (62 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు 70 నాటౌట్), మోర్గాన్ (29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 నాటౌట్)తో కలిసి జట్టును గెలిపించాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 70 బంతుల్లో 92 పరుగులు జోడించారు. ఈ పెర్ఫామెన్స్‌తో గిల్‌పై ప్రశంసల జల్లు కురుస్తుంది. టీమిండియా భవిష్యత్తు సారథని మాజీ క్రికెటర్లు ప్రశంసిస్తున్నారు.
మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ గత రెండు మ్యాచ్‌ల్లో పూర్తిగా తెలిపోయాడు. హైదరాబాద్‌తోనైతే డకౌట్‌గా వెనుదిరిగాడు. ఫస్ట్ మ్యాచ్‌లో కెప్టెన్‌గా విఫలమైనా.. రెండో మ్యాచ్‌లో తన సారథ్య స్కిల్స్‌ను చాటుకున్నాడు. కానీ అతని కెప్టెన్సీపై అందరికి ఓ అనుమానం నెలకొంది. ఈ క్రమంలోనే జట్టు పగ్గాలను ఇంగ్లండ్ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఇవ్వాలని చర్చ నడుస్తుండగా.. కెవిన్ పీటర్సన్ మరో చర్చకు తెరదీసాడు. శుభ్‌మన్ బ్యాటింగ్‌ను మెచ్చుకుంటూ అతనికి కేకేఆర్ సారథ్య బాథ్యలు ఇవ్వాలని సూచించాడు. 'శుభ్‌మన్ గిల్‌ను కేకేఆర్ కెప్టెన్ చేయాలి'అని ట్వీట్ చేశాడు.

ఇక భారత్ గెలిచిన 2018 అండర్19 ప్రంపచకప్‌లో గిల్ కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే అతని బ్యాటింగ్‌తో భారత క్రికెట్‌కు మంచి భవిష్యత్తు ఉందన్న నమ్మకం కలిగించాడు. ఇదే నిలకడైన ఆటను కొనసాగిస్తే త్వరలోనే భారత జట్టులోకి రావచ్చు.

ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రైజర్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. మనీశ్ పాండే (38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 51) అర్ధ సెంచరీ నమోదు చేయగా, డేవిడ్ వార్నర్ (30 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 36 ), వృద్ధిమాన్ సాహా (31 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్ 30) మోస్తరుగా ఆడారు. కోల్‌కతా బౌలర్లలో కమిన్స్, వరున్, రస్సెల్ తలో వికెట్ తీశారు. అనంతరం కోల్‌కతా 18 ఓవర్లలో 3 వికెట్లకు 145 పరుగులు చేసి గెలుపొందింది.