
చెన్నైకి చాన్స్..
'ఏప్రిల్‌లో ఐపీఎల్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌ను 'డాడీస్ ఆర్మీ'గా రాసుకొచ్చారు. కానీ ఫస్టాఫ్‌లో వాళ్ల ప్రదర్శన ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈ నాలుగు నెలల విరామం తర్వాత వారు ఎలా ఆడుతారనే కచ్చితంగా చెప్పలేను. కానీ ఈ బ్రేక్‌ను వాడుకొని వారు చెలరేగితే, ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లు సెట్ అయితే చెన్నైకి తిరుగుండదు.
చెన్నై మరో టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.'పీటర్సన్ రాసుకొచ్చాడు. ఇక ఫస్టాఫ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన సీఎస్‌కే.. ఏడు మ్యాచ్‌ల్లో ఐదు గెలిచి పాయింట్స్ టేబుల్లో రెండో స్థానంలో కొనసాగుతుంది. మిగిలిన ఏడు మ్యాచ్‌ల్లో కనీసం నాలుగు గెలిచినా ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది.

ఒక్క మ్యాచ్ ఓడిపోవద్దు...
ముంబై ఇండియన్స్ అవకాశాలను తన కాలమ్‌లో ప్రస్తావించిన పీటర్సన్.. ఆ జట్టు ఆరంభంలో ఓడిపోవద్దన్నాడు. మాములుగా ముంబై ఆరంభంలో తడబడి ఆ తర్వాత పుంజుకొంటుందని, కానీ ఈ సారి అది కుదరదని పేర్కొన్నాడు. ఎందుకంటే ఇప్పటికే సగం టోర్నీ అయిపోయిందని, రీ స్టార్ట్ అయ్యే లీగ్‌లో వరుసగా విజయాలందుకుంటేనే ప్లే ఆఫ్ చేరుతుందన్నాడు. 'ఆరంభ మ్యాచ్‌ల్లో ఓడిపోవడం.. ఆ తర్వాత అనూహ్యంగా చెలరేగడం ముంబై ఇండియన్స్ నైజం.
కానీ ఈసారి అలా ఆడితానంటే కుదరదు. ఎందుకంటే ఇప్పటికే సగం లీగ్ పూర్తయింది. వాళ్లు టైటిల్ సాధించాలంటే ప్రతీ మ్యాచ్ గెలవాల్సిందే. అయితే ఆ జట్టులో టాలెంట్‌కు లోటు లేదు. టైటిల్ అందుకునే సామర్థ్యం వారికి ఉంది'అని పీటర్సన్ పేర్కొన్నాడు.
ఇక ఫస్టాఫ్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచిన ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో ఎనిమిది పాయింట్లతో నాల్గవ స్థానంలో ఉంది. ప్లే ఆఫ్ చేరాలంటే ఆ జట్టు ఏడింటిలో కనీసం ఐదు మ్యాచ్‌లు గెలవాలి. నాలుగు గెలిచినా మెరుగైన రన్ రేట్ ఉండాలి.

ఫ్యామిలీ లేకుండా బబుల్‌లోనా?
యాషెస్ సిరీస్‌కు సంబంధించి పీటర్సన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా ప్రభుత్వం విధించిన కఠిన క్వారంటైన్ నిబంధనల నేపథ్యంలో చాలా మంది ఇంగ్లండ్ ఆటగాళ్లు యాషెస్ సిరీస్‌ను బాయ్‌కట్ చేయాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో ఇంగ్లండ్ ఆటగాళ్లకు పీటర్సన్ అండగా నిలిచాడు. 'యాషెస్ సిరీస్‌కు సంబంధించిన అప్‌డేట్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.
కఠిన బబుల్స్‌లో కుటుంబాలకు దూరంగా ఉండేందుకు ఆటగాళ్లు ఇష్టపడటం లేదు. నేను కూడా నా కుటుంబాన్ని అనుమతించకుంటే యాషెస్ ఆడేందుకు వెళ్లేవాడినే కాదు. ఆటగాళ్ల బాధను అర్థం చేసుకోగలను. యాషెస్ ఆడటం ఎవరికైనా ఉత్సాహంగానే ఉంటుంది. కానీ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆడటం ఎవరికైన కష్టమే'అని పీటర్సన్ పేర్కొన్నాడు. ఈ ఏడాది డిసెంబర్‌లో యాషెస్ సిరీస్ జరగనుంది.


Click it and Unblock the Notifications
